కల్కి 2898 ఏడి: ట్రైలర్ని రాంగ్ టైంలో రిలీజ్ చేస్తున్నారుగా?

Purushottham Vinay
పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 ఏడీ జూన్ 27న రిలీజ్ కి రెడీ అవుతోంది. భారీ బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ ఈ భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీని నిర్మించింది.ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ చిత్రంగా కల్కి 2898ఏడీ మూవీ థియేటర్స్ లోకి రానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సినిమా నుంచి బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ ని కూడా రిలీజ్ చేశారు. దీనికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఇంకా అలాగే బుజ్జి పేరుతో అడ్వాన్స్ మోడల్ కారుని కల్కి మూవీ కోసం డిజైన్ చేశారు. ఈ కారుని ప్రస్తుతం ప్రమోషన్స్ లో బాగా ఉపయోగిస్తున్నారు. ఇదిలా ఉంటే జూన్ 10న కల్కి మూవీ ట్రైలర్ రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించింది.


ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యి మొదటి రోజు పబ్లిక్ థియేటర్స్ కి వచ్చేలా చేయడంలో ట్రైలర్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పాలి. తెలుగు రాష్ట్రలతో పాటు కర్ణాటక ఇంకా మిగిలిన రాష్ట్రాల థియేటర్లలో కూడా ఈ ట్రైలర్ స్క్రీనింగ్ కానుంది.సినిమా కంటెంట్ కనెక్ట్ అయ్యేలా ట్రైలర్ ను సాలీడ్ గా రెడీ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. అయితే కల్కి మూవీ ట్రైలర్ ని జూన్ 10 న రిలీజ్ చేయడం కరెక్టేనా అనే ప్రశ్న కూడా ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. దీనికి కారణం దేశ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం పొలిటికల్ బజ్ నడుస్తోంది.ఇప్పుడు పబ్లిక్ అంతా కూడా ఆ పొలిటికల్ మూడ్ లోనే ఉన్నారు. మరో వైపు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ వ్యక్తి రామోజీరావు గారు టాలీవుడ్ కి పెద్ద పిల్లర్ లాంటి వారు. ఆయన చనిపోయారు. అతని కోసం ఏపీలో రెండు రోజులు సంతాప దినాలని ప్రకటించారు.ఇంకా అలాగే కేంద్రంలో ప్రధానిగా ప్రమాణస్వీకారం, క్యాబినెట్ ప్రకటనపైన మీడియా ఫోకస్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: