వరుస సినిమాలతో దూసుకుపోతున్న చాందిని చౌదరి..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని చాందిని చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది . ఇకపోతే కెరియర్ ప్రారంభంలో ఈమె నటించిన సినిమాల ద్వారా ఈ బ్యూటీ కి పెద్దగా గుర్తింపు దక్కలేదు . అలాంటి సమయం లోనే ఈమె సుహాస్ హీరో గా రూపొందిన కలర్ ఫోటో సినిమాలో హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ థియేటర్ల లో కాకుండా నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో  స్ట్రీమింగ్ అయింది.

ఇక ఈ సినిమా అద్భుతంగా ఉండడం , ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగు సినిమా పరిశ్రమల అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ బ్యూటీ గామి అనే సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈమె వరస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతుంది.

తాజాగా చాందిని యేవ‌మ్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ జూన్ 14 వ తేదీన థియేటర్లో విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు ఈ నటి మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమాలో కూడా కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ కూడా జూన్ 14 వ తేదీన విడుదల కానుంది. ఇలా ఈ బ్యూటీ నటించిన రెండు సినిమాలు కూడా ఒకే రోజు థియేటర్లలో విడుదల కానున్నాయి. ఈ సినిమాలు కనుక మంచి విజయాలను అందుకున్నట్లు అయితే ఈ నటికీ తెలుగు లో మరింత క్రేజ్ రావడం , ఆ తర్వాత మంచి సినిమాలలో అవకాశాలు రావడం కూడా జరిగే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

cc

సంబంధిత వార్తలు: