హిట్ అనిపించుకోవడానికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కేవలం అంత రాబడితే చాలు..?

Pulgam Srinivas
విశ్వక్ సేన్ తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో హీరోగా నటించాడు.  సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ మూవీ లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా , అంజలి ఓ కీలకమైన పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా మే 31 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 8 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ కి 8 రోజుల్లో నైజాం ఏరియాలో 3.29 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.61 కోట్లు , ఉత్తరాంధ్ర లో ఒక కోటి , ఈస్ట్ లో 68 లక్షలు , వెస్ట్ లో 52 లక్షలు , గుంటూరు లో 62 లక్షలు , కృష్ణ లో 52 లక్షలు , నెల్లూరు లో 38 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు 8 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.62 కోట్ల షేర్ ... 15.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 8 రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 63 లక్షల కలెక్షన్ లు దక్కగా , ఓవర్ సీస్ లో 1.14 కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి 8 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 10.39 కోట్ల షేర్  , 19.15  కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమాకు 10.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 11 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ సినిమా మరో 61 లక్షల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs

సంబంధిత వార్తలు: