"లక్కీ భాస్కర్' కి పోటీగా మరో మూవీ..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే మూవీ లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల పాటు ఫుల్ స్పీడ్ గా జరిగింది. అలా ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతున్న సమయంలో ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దానితో ఈ సినిమా విడుదల తేదీ దగ్గరలో ఏ మూవీ బృందం కూడా తమ సినిమా విడుదల తేదీని ప్రకటించలేదు.

ఇకపోతే పవన్ గత కొన్ని నెలలుగా రాజకీయ పనులతో బిజీగా ఉండడంతో ఓజి సినిమా షూటింగ్ ఆగిపోయింది. దానితో సెప్టెంబర్ 27 వ తేదీన ఈ మూవీ విడుదల కాదు అనే నేపథ్యంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరో గా రూపొందుతున్న లక్కీ భాస్కర్ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితో ఈ మూవీ కి తిరుగేలేదు , పోటీ లేదు. దానితో మంచి కలెక్షన్లు ఈ మూవీ కి వస్తాయి అని చాలా మంది అనుకున్నారు. అంతలోనే ఈ సినిమాకు మరో మూవీ పోటీలోకి దిగబోతుంది.

ప్రస్తుతం తమిళ నటుడు శివ కార్తీకేయన్ "అమ‌ర‌న్" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. నిజంగానే ఈ సినిమాను కూడా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేసినట్లు అయితే లక్కీ భాస్కర్ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ds

సంబంధిత వార్తలు: