45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న స్టార్ కమెడియన్..!?

Anilkumar
కోలీవుడ్ స్టార్ కమెడియన్ మ్యూజిక్ కంపోజర్ ప్రేమ్ జి చాలా మందికి తెలిసే ఉంటాడు. 2006లో ఆయన సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆయన నటించిన చెన్నై 600028 అని సినిమా తర్వాత తనకి స్టార్ కమెడియన్ గా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. కేవలం కమెడియన్ గానే కాకుండా మ్యూజిక్ కంపోజర్ గా కూడా భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే

 తాజాగా ఆయన పెళ్లి చేసుకున్నట్లుగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతున్నాయి. వాటికి సంబంధించిన ఫోటోలు సైతం నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి. ఇక అసలు విషయం ఏంటంటే ప్రేమ్ జి ఇందు అనే అమ్మాయిని జూన్ 9న పెళ్లి చేసుకున్నాడు. ఎటువంటి హడావిడి లేకుండా అర్ధరాత్రి పెళ్లి చేసుకున్నాడు. ఇరు కుటుంబ సభ్యులు మరియు అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఇందు ప్రేమ్ జీల వివాహం జరిగింది. అయితే ఈ విజయాన్ని ప్రియంజి సోదరుడు ప్రముఖ డైరెక్టర్ వెంకట్ ప్రభు తన సోషల్ మీడియా వేదికగా

 తాజాగా ఫోటోలను షేర్ చేశాడు. వాళ్ళిద్దరి పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ శుభాకాంక్షలు అని తెలిపాడు. ప్రస్తుతం వీళ్ళిద్దరికీ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవ్వగా ప్రేమ్ జి మాత్రం ఈ ఫోటోలు వార్తలపై అసలు స్పందించలేదు. అయితే ఎంతో కాలంగా వీళ్ళిద్దరికీ సంబంధించిన పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా ఇప్పుడు మాత్రం వెంకట్ ప్రభు స్వయంగా వాళ్ళ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా ప్రేమ్జీకి పెళ్లి అయిపోయింది అన్న క్లారిటీ వచ్చింది. దాదాపుగా 45 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్నాడు. మరి ఇప్పటికైనా పెళ్లి విషయంపై స్పందిస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: