మరో రికార్డ్ క్రియేట్ చేసిన మహేష్.. కుర్చీ మడత పెట్టాడుగా..!
ఈ మూవీ రిలీజ్ అనంతరం డీసెంట్ టాక్ సంపాదించుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం జోరుగానే రాబట్టింది. అయితే ఈ మూవీలో థమన్ కంపోజ్ చేసిన సెన్సేషనల్ హిట్ కుర్చీ మడతపెట్టి సాంగ్ కూడా ఒకటి. ఇక ఈ సాంగ్ కి భారీ రెస్పాన్స్ దక్కింది. మన తెలుగు నుంచి ఫాస్టెస్ట్ 100 మిలియన్ నుంచి 200 మిలియన్ వ్యూస్ ఉన్న సాంగ్స్ లో ఒకటిగా అదిరా రెస్పాన్స్ తో దూసుకెళ్తున్న ఈ పాట ఇప్పుడు రెండు మిలియన్ లైక్స్ ని క్రాస్ చేసి మహేష్ ఖాతాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక దీంతో పాటుగా సాంగ్ ఇప్పుడు 3 మిలియన్ వ్యూస్ దిశగా దూసుకెళ్తున్న అన్ స్టాపబుల్ గా ఉందని చెప్పుకోవచ్చు.
ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, రామకృష్ణ తదితరులు నటించగా హారిక హాసిని వారు దీనిని నిర్మించారు. మంచి అంచనాలతో థియేటర్ల వద్ద రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుంకుది. ఇందుకు కారణం స్టోరీ రొటీన్ గా ఉండటమే. స్టోరీలో కొత్తదనం లేకపోవడంతో ఈ మూవీ ని చూసేందుకు పెద్దగా ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించలేదు. దీనికి తోడు అదే సమయంలో హనుమాన్ మూవీ మంచి టాక్ సంపాదించుకోవడంతో ఈ మూవీని చూసే సాహసం ఎవరు చేయలేదు. కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం బాగానే రాబట్టింది. ఓస్టార్ హీరో సినిమా అంటే ఆ మూవీ మిక్స్డ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ మినిమం కలెక్షన్స్ రాబడుతుంది. ఇక ఈ సినిమాతో మరోసారి ఇది ప్రూవ్ అయింది.