మనమే: బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే పోతుందే?

Purushottham Vinay
సక్సెస్ ఫెయిల్యూర్స్ తో ఎలాంటి సంబంధం లేకుండా కొనసాగుతున్న శర్వనంద్ కెరీర్ ఇప్పుడు మనమే సినిమాతో మరో సక్సెస్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు.ఇక మొదటి రోజు ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రం స్టడీ గానే ఉన్నాయి.కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా కన్నా మంచి డీసెంట్ వసూళ్లు వచ్చాయనే తెలుస్తుంది.ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మనమే సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. ఇక ఈ యంగ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో కొన్ని ఫ్యామిలీ ఎలిమెంట్స్ అయితే బాగానే వర్క్ అవుట్ అయ్యాయి. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా రివ్యూలు కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి వల్గారిటీ లేకుండా చాలా క్లీన్ మూవీ అని మరొక టాక్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కూడా మెల్లమెల్లగా పెరుగుతోంది.


ఇక వీకెండ్ కూడా ఈ మూవీకి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది.పైగా పోటీగా కూడా పెద్దగా సినిమాలు ఏమీ లేవు కాబట్టి ఈ వారం మనమే సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకునే ఛాన్స్ ఉంది.శనివారం కూడా అడ్వాన్స్ బుకింగ్ తో ఈ మూవీ మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తుంది. చివరి 24 గంటలలో ఈ మూవీకి బుక్ మై షో లో ఏకంగా 55 వేలకు పైగా టికెట్లకు పైగా అమ్ముడుపోయాయి. దీన్ని బట్టి సినిమాకు ఆదరణ ఏ రేంజ్ లో పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. మనమే సినిమాలో యంగ్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.ఆమె కూడా ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుని మళ్లీ ఫామ్ లోకి రావాలని అనుకుంటుంది. ఇక మూవీకి మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్  వచ్చింది. ఇక శనివారం కూడా ఇదే రేంజ్ లో రెస్పాన్స్ అందితే ఆదివారం కూడా ఈ సినిమాకి కలిసి వచ్చినట్టే. ఈ వారంలోనే సినిమా ఇలానే కలెక్షన్స్ అందుకుంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా చాలా తొందరగానే పూర్తవుతుంది. మరి మనమే సినిమా మొత్తంగా ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: