కల్కి 2898ఏడి: ఆకాశాన్ని తాకేలా టికెట్ రేట్స్, బెనిఫిట్ షోస్?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమాటిక్ వరల్డ్ లో భాగంగా కల్కి మొదటి భాగం కల్కి 2898 AD సినిమా మరో 20 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రచార చిత్రాలతో ఇప్పటికే అంచనాలు పీక్స్ లో ఉండగా సినిమా ఆ అంచనాలను అందుకుంటే మాత్రం నెవర్ బిఫోర్ అనిపించేలా రికార్డులు క్రియేట్ చెయ్యడం ఖాయం.తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు కల్కి కోసం నార్త్ సైడ్ కూడా భారీ ఈవెంట్స్ ని ప్లాన్ చేస్తున్నారు కల్కి మేకర్స్. ముంబైలో అయితే ఒక భారీ స్థాయి ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.ఇక తెలుగులో కూడా కల్కి మూవీ కోసం ఒక పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లానింగ్ లో ఉందట. అది కూడా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుందని తెలుస్తుంది. ఈ ఈవెంట్ కి ఏపీ కొత్త సీఎం చంద్రబాబు ఇంకా జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఇద్దరిని ఆహ్వానించేలా మేకర్స్ ఆలోచన చేస్తున్నారట.ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో కూటమిగా ఏర్పడి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సాధించిన విక్టరీ తెలిసిందే. కల్కి మూవీ నిర్మాత అశ్వనీదత్ కూడా వారికి మోరల్ సపోర్ట్ గా ఉన్నారు.మిగతా పరిస్థితులు ఎలా ఉన్నా కానీ ఏపీలో గత ఐదేళ్ల నుంచి సినిమా పరిశ్రమకు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది.


ఐతే మారిన ప్రభుత్వం అలా కాకుండా సినీ పరిశ్రమకు అండదండగా ఉంటుందని నిర్మాతలు భావిస్తున్నారు. కల్కి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఆ విషయాన్ని డిక్లేర్ చేసేలా కొత్త సీఎం చంద్రబాబుతో పాటు సినీ హీరో ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ని కూడా ఈ వేదికకు ఆహ్వానిస్తారని తెలుస్తుంది.పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఇద్దరు ఒకే వేదిక మీద కనిపిస్తే ఆ రేంజ్ అసలు వేరేలా ఉంటుంది. సినిమా పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడేలా ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలని ఈ వేదిక ద్వారా రిక్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. మరి కల్కి మూవీ కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వస్తారా లేదా కల్కి కోసం మరో గెస్ట్ ని ఎవరినైనా తీసుకొస్తారా అన్నది మాత్రం చూడాలి. కల్కి సినిమా విషయానికి వస్తే టైం ట్రావెల్ కథకు డివోషనల్ టచ్ ఇస్తూ నాగ్ అశ్విన్ అద్భుతాన్ని చూపించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. హీరో ప్రభాస్ కూడా కల్కి అవుట్ పుట్ మీద సూపర్ సాటిస్ఫై డ్ గా ఉన్నాడు. ఈ సినిమా బెనిఫిట్ షోస్, టికెట్ రేట్స్ కూడా భారీగా పెరగనున్నాయి.రేపు రిలీజ్ అవ్వబోయే ట్రైలర్ పై ఆసక్తికరంగా ఉన్నారు ఫ్యాన్స్.మరి కల్కి మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుంది అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: