OG: ఫ్యాన్స్ కి ఫుల్ మీల్సే?

Purushottham Vinay
పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఇక సినిమాల్లో కనిపించడం కష్టమే. ఎమ్మెల్యే అయ్యాక పవన్ సినిమాలకు దూరం కానున్నాడని సమాచారం. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో మూడు పెద్ద సినిమాలు ఉన్నాయి. అవి హరిహర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్.ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ దాదాపు ఫినిష్ కావొస్తుంది. ఇంకా అంతేకాకుండా ఓటిటీ డీల్ కూడా జరిగిపోయింది. అమెజాన్ ఈ సినిమా హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడమే ఆలస్యం. ఈ సినిమా కాకుండా OG సినిమా సగం షూటింగ్ ను ఫినిష్ చేసుకుంది. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. అలాగే బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపిస్తున్నాడు.ఇక సెప్టెంబర్ 27 న ఈ మూవీ రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు.


కానీ, ఈ మధ్య OG వాయిదా పడే అవకాశం ఉన్నట్లు అనేక వార్తలు వచ్చాయి. అందుకు కారణం.. OG మూవీ ఓటిటీ హక్కులను ఏ సంస్థ కొనుగోలు చేయకపోవడమే అని టాక్. ఆ సమయంలో ఓటిటీ స్లాట్స్ లేకపోవడంతో OG ని కొనుగోలు చేయలేకపోయినట్లు వార్తలనేవి వచ్చాయి.ఇక తాజాగా OG సినిమా ఓటిటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ తన్నుకుపోయిందని సమాచారం తెలుస్తోంది. పైగా అది కూడా చిన్నా చితకా అమౌంట్ తో కాదు.  ఏకంగా రూ. 92 కోట్లు.. అంటే దాదాపు ఏకంగా రూ. 100 కోట్లకు దగ్గరలో అన్నమాట. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఇంత హయ్యెస్ట్ రేటు ఏ సినిమాకు రాలేదు. దీంతో ఇదిరా OG రేంజ్ అని ఆయన అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఈ సినిమాలో మరికొన్ని సీన్స్ కూడా యాడ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచినందున ఇంకా పవర్ ఫుల్ సీన్స్ యాడ్ చేస్తున్నారట. ఖచ్చితంగా ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అవుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: