ఆ స్టార్ హీరోకి అక్కగా రీఎంట్రీ ఇవ్వబోతున్న హ.. హ..హాసిని..!!

murali krishna
ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన జెనీలియాకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈమె నటించిన బొమ్మరిల్లు సినిమాలో హాసిని పాత్రలో నటించి మెప్పించిన ఈ చిన్నది..తన క్యూట్ క్యూట్ మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.కాగా 2012లో నా ఇష్టం సినిమా తర్వాత తెలుగులో ఎటువంటి సినిమాల్లోనూ జెనీలియా నటించలేదు. బాలీవుడ్ నటుడు నితీష్ దేశ్ ముఖ్ ను ప్రేమించి వివాహం చేసుకున్న ఈ అమ్మడు కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా సరే ఇప్పటికి జెనీలియాలో ఆ క్యూట్నెస్, చిన్నపిల్ల అల్లరితనం మాత్రం ఇంకా పోలేదు. తన భర్తతో కలిసి ఆమె చేసే ఇన్‌స్టా రీల్స్ చూస్తుంటే ఇది క్లియర్ గా అర్థమవుతుంది.నితీష్, జెనీలియా కలిసి చేసే రీల్స్ ని ఇప్పటికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో లక్షలాదిమంది అభిమానులు ఉన్నారు.
ఇక తాజాగా ఈ అమ్మడు భర్తతో కలిసి సొంతంగా సినీ నిర్మాణం కూడా స్టార్ట్ చేసింది. తన భర్త నితీష్ తో కలిసి మరాఠీలో వేద్‌ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. మజిలీకి రీమేక్ గా వచ్చిన ఈ వేద్‌ సినిమా బాలీవుడ్ లోనూ భారీ సక్సెస్ అందుకుంది. ప్రేక్షకుల ప్రశంసలు అందాయి.ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న హీరోయిన్స్ ఎక్కువైపోతున్నారు. ఒకప్పుడు తమ అందచందాలతో ఇండస్ట్రీని ఏలేసి కుర్రాళ్లను తమ వైపు తిప్పుకున్న బ్యూటీస్ ఆ తర్వాత పర్సనల్ లైఫ్ లో సెటిలైయి పెళ్లి చేసుకుని ..పిల్లలను కనీ మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో తాము ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొందరు బ్యూటీస్ . తాజాగా అదే లిస్టులోకి రాబోతుంది హీరోయిన్ జెనీలియా .హ..హ..హ హాసిని అంటూ తనదైన స్టైల్ లో బొమ్మరిల్లు సినిమాలో నటించి హ్యూజ్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న హాసిని అదే మన జెనీలియా గురించి ప్రత్యేకంగా చెప్పుకో అక్కర్లేదు . రితేష్ దేశముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకొని బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చేసి ఫ్యామిలీ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తుంది. అంతేకాదు సోషల్ మీడియాలో నిరంతరం ఆక్టివ్ గా ఉంటుంది . తనదైన స్టైల్ లో అభిమానులతో చిట్ చాట్ కూడా చేస్తూ ఉంటుంది . రీసెంట్గా జెనీలియా కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది.
త్వరలోనే ఓ స్టార్ హీరో సినిమాతో తెలుగులో రియంట్రి ఇవ్వబోతుందట . అయితే ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఆ హీరోకి అక్క పాత్రలో కనిపించబోతుందట . ఆశ్చర్యం ఏంటంటే జెనీలియా కన్నా వయసులో పెద్దవాళ్లయిన త్రిష - నయనతార ఇప్పటికీ హీరోయిన్స్ గా మెప్పిస్తున్నారు . అయితే జెనీలియా మాత్రం ఎందుకు అక్క రోల్ చూస్ చేసుకుంది అనేది మాత్రం అస్సలు అర్థం కావడం లేదు. దీంతో జెనీలియా తీసుకునే డెసిషన్ కరెక్టేనా అన్న సందిగ్ధంలో పడిపోయారు అభిమానులు. ఏ రోల్ అయితే ఏం నటనతో మెప్పిస్తే చాలు అనేదే జెనీలియా ఒపీనియన్ .. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటున్నారు అభిమానులు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: