రామోజీరావు: ఆ కోరిక తీరకుండానే కన్నుమూత..!

Divya
ఈనాడు సంస్థల అధినేతగా అందరికీ సుపరిచితుడే రామోజీరావు.. ముఖ్యంగా రామోజీరావు ఫిలిం సిటీ నిర్మించడమే కాకుండా ఎన్నో చిత్రాలకు కూడా నిర్మాతగా వ్యవహరించారు. ముఖ్యంగా ఉషా కిరణ్ మూవీ సంస్థ పైన సినిమాలనే కాకుండా సీరియల్స్ను ఎన్నో షోలను కూడా చేసి మరుపురాని సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు రామోజీరావు. ఎన్నో విభిన్నమైన కథలకు పెట్టింది పేరు అని చెప్పవచ్చు బ్యాక్ గ్రౌండ్ ఉందా లేకుండా ఎంతోమంది దర్శకులను నటీనటులకు సైతం అవకాశాలు ఇచ్చి వారి ప్రతిభను కూడా ప్రోత్సహించేవారు.

అలా ఎందరినో తెలుగు సినీ పరిశ్రమకు అందించిన రామోజీరావు ఈ రోజున కన్నుమూయడంతో చాలామంది అభిమానులు నేతలు వ్యాపారవేత్తలు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అయితే ఈ సంస్థ చివరిగా దాగుడుమూతల దండాకోరు అనే సినిమాను చేసింది. ఈ చిత్రంలో హీరోగా రాజేంద్రప్రసాద్ నటించారు కానీ ఈ సినిమా ఆడినట్టుగా కూడా ఎవరికీ తెలియదు. ఆ తర్వాత ఉషా కిరణ్ నుంచి ఎలాంటి సినిమాలు రాలేదు మిగిలిన వ్యాపారాలలో కనిపించే లాభం సినిమాలలో లేకపోయేసరికి నెమ్మదిగా సినిమా నిర్మాణం నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి.

అయితే కరోనాకు ముందు 2019 సమయంలో మళ్లీ ఉషా కిరణ్ మూవీస్ ఆక్టివ్ అయ్యేందుకు ప్రయత్నించారు. అలా కొన్ని కథలను కూడా సిద్ధం చేసినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. దాదాపుగా ఉషా కిరణ్ బ్యానర్ పైన 85 సినిమాలను తెరకెక్కించారు. మరో 15 సినిమాలు తీయాలని కోరికతో రామోజీరావు ఉండే వారిని సమాచారం. కానీ కథల ఎంపిక విషయంలో సరైన సినిమాలను రూపొందించాలని అనుకున్నారు. 2016- 17 తర్వాత తొలి సినిమాతో హిట్టు కొట్టిన కొంతమంది దర్శకులకు ఉషా కిరణ్ మూవీస్ నుంచి పిలుపు వచ్చాయట. కొన్ని కథలకు కూడా రామోజీరావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అయితే కరోనా ఎంట్రీ తో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోవడంతో అలా 100 సినిమాలు చేయాలని కోరిక తీరకుండానే రామోజీరావు మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: