బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతున్న "భజే భాయు వేగం"..!

Pulgam Srinivas
కార్తికేయ కొంత కాలం క్రితం "బెదురులంక 2012" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఈ నటుడు భజే వాయు వేగం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో "స్పై" సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ 31 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 6 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.
6 రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 1.22 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఆంధ్రప్రదేశ్ లో 1.48 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో 2.70 కోట్ల షేర్ , 5.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక 6 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 45 లక్షల కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల్లో 3.15 కోట్ల షేర్ ... 6.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమాకు 3.60 ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా , 4 కోట్ల టార్గెట్ టి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ మూవీ మరో 85 లక్షల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. ఇక మరో రెండు , మూడు రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా హిట్ స్టేటస్ ను అందుకుంటుందో , లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: