"గం గం గణేశా" కి 6 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
ఆనంద్ దేవరకొండ తాజాగా గం గం గణేశా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందింది. కామెడీ ఎంటర్టైనర్ మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మొదటి నుండి మంచి అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ మూవీ మంచి అంచనాల నడుమ మే 31 వ తేదీన విడుదల అయింది.  మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చింది.  దానితో ఈ సినిమాకు కలెక్షన్లు చాలా వరకు తగ్గాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ వరల్డ్ వైడ్ గా కంప్లీట్ అయింది. అందులో భాగంగా ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు వచ్చాయి , అలాగే మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లు వచ్చాయి. ఎన్ని కోట్ల కలెక్షన్ లను సాధిస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.
6 రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 97 లక్షల కలెక్షన్లు దక్కగా , ఆంధ్రప్రదేశ్ లో 1.13 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో 2.20 కోట్ల షేర్ , 4.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి  6 రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్ సీస్ లో 31 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 2.41 కోట్ల షేర్ , 5.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 6 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 5.50 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 3.09 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా సాధిస్తే హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: