మనమే సినిమాలో అసలైంది మిస్ అయ్యిందే?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్  ఏ సినిమా చేసినా కూడా ఎమోషనల్ గా ఉండేలా...కొన్ని కొత్త ప్రయోగాలు చేస్తూ  ఉంటాడు. అయితే ఈ రోజు రిలీజ్ అయిన మనమే సినిమా మాత్రం కాస్త డిఫరెంట్ జోనర్ లా కనిపిస్తుంది.బ్యాడ్ ఫేజ్‌లో ఉన్న కృతి శెట్టి , శర్వా కలిసి చేసిన మనమే చిత్రం ఈ రోజు అనగా జూన్ 7న థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఫస్టాఫ్ అంతగా బాగాలేదు.ఆడియన్స్ కు చాలా బోర్ కొట్టేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ ఎప్పుడా అని ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తుంది. సెకండ్ హాఫ్ కూడా అంతగా మెప్పించలేదు. అసలు హీరో కారెక్టర్‌లోనే క్లారిటీ అనేది మిస్ అయినట్టుగా కనిపిస్తుంది.భారీ లొకేషన్‌లు, అదిరిపోయే విజువల్స్.. ఎప్పటిలానే ఒకే టోన్‌లో వినిపించే హేషమ్ పాటలు, ఆర్ఆర్ ఇవేవీ కూడా సినిమాను నిలబెట్ట లేదు. ప్రస్తుతం సరైన కథ, బలమైన సీన్లు, కదిలించే కథనం ఉంటే తప్పా సినిమాను జనాలు చూడరు. మనమే సినిమా కథలో క్లారిటీ లేకపోవడమే సినిమాకు మైనస్.


 సినిమాలో హీరో శర్వానంద్ నటన బాగానే ఉంటుంది. బాగా ఫుల్ ఎనర్జీతో కనిపించాడు. కామెడీ, లవ్, ఎమోషన్ ఇలా అన్నీ సీన్లలో కూడా మెప్పిస్తాడు. హీరోయిన్ కృతి శెట్టి ఇది వరకటి సినిమాల్లో కనిపించినట్టుగా, నటించినట్టుగానే అనిపించింది. ఆమె గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. రాజ్ కందుకూరి, త్రిగుణ్ పాత్రలకు అంత ప్రాధాన్యత లేదనిపించింది. వెన్నెల కిషోర్ కనిపించి నాలుగైదు సీన్లలో బాగానే నవ్వించాడు. ఇక రాహుల్ రవీంద్రన్ విలనిజం ఏమంతగా లేదు. కమెడియన్ రాహుల్ రామకృష్ణకు సరిపోయే పాత్ర కాదనిపించింది. సచిన్ ఖేదెకర్, సీత, ముఖేష్ రిషి, తులసి ఇంకా అలాగే సీరత్ కపూర్ ఇలా అన్ని పాత్రలు ఓకే అనిపిస్తాయి. కానీ ఏ ఒక్కటి కూడా అంత ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేదు. సినిమా జస్ట్ యావరేజ్ గా ఉంటుంది.అంత కొత్తగా అయితే అనిపించదు. టాలీవుడ్ లో ఎన్నో సంవత్సరాల నుంచి సినిమాలు చేస్తున్న శర్వనంద్ ప్రస్తుతం ట్రెండ్ కి తగ్గట్లు ఏమైనా కొత్తగా ట్రై చేస్తే మళ్ళీ లైట్ లోకి వస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: