రజినికాంత్ సినిమాలో బాలకృష్ణ గెస్ట్ రోల్..??

murali krishna
సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.జైలర్ మూవీతో రజనీకాంత్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఆ సినిమా తరువాత రజనీకాంత్ తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించిన 'లాల్ సలాం' సినిమాలో గెస్ట్ పాత్రలో నటించారు.కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.ఈ సినిమా తరువాత తలైవా వరుస సినిమాలను లైన్ లో పెట్టారు.వాటిలో 'కూలీ' మూవీ ఒకటి.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే తాజాగా ఒక వార్త నెట్ ఇంత చక్కర్లు కొడుతుంది.కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లోనూ ఈ సూపర్ స్టార్ కి మంచి ఫాలోయింగ్ ఉంది.రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో జైలర్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే.ఇక ఈ మూవీ భారీ సక్సెస్ సాధించడంతో రజనీకాంత్ కు స్ట్రాంగ్ త్రో బ్యాక్ వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ 500 కోట్ల భారీ కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ తీస్తున్నారు. అందుకోసం స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసే పనిలో ఉన్నాడు డైరెక్టర్.ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సీక్వెల్ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందుతుంది. నందమూరి మాస్ హీరో జైలర్ సీక్వెల్లో ఒకేలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆయన ఎవరు అని ఆలోచిస్తున్నారా.. ఆ హీరో మరెవ్వరో కాదు నందమూరి నట సింహం బాలకృష్ణ. బాలయ్య ఈ మూవీలో గెస్ట్ రోల్ లో ప్లే చేయనున్నట్లు తెలుస్తుంది.ఓ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టార్ గా ఆయన ఈ పాత్ర క్లైమాక్స్లో కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇక మొదటి భాగంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ముఖ్యపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఇక రెండవ భాగంలో వీరికి బాలయ్య కూడా తోడయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: