ఆ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గని పాయల్ రాజ్పుత్..?

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి రాజ్పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ కార్తికేయ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఎక్స్ 100 అనే సినిమాతో తెలుగు పరిచయం అయింది. ఈ మూవీ లో ఈమె తన అందాలతో , నటనతో ప్రేక్షకులను కట్టిపాడేయడం అలాగే ఈ మూవీ కూడా మంచి విజయం సాధించడంతో ఈ సినిమా తర్వాత ఈమెకు భారీ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కాయి.

ఇకపోతే కొన్ని రోజుల క్రితం ఈ బ్యూటీ మంగళవారం అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇకపోతే ఈమె ఆర్ ఎక్స్ 100 మూవీ తర్వాత ఈ నటి రక్షణ అనే ఓ సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా ఆ సమయం లో విడుదల కాలేదు. ఆ మూవీ ని ఈ రోజు విడుదల చేశారు. అయితే ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం ఈ బ్యూటీ చాలా సంవత్సరాల క్రితం నేను రక్షణ అనే సినిమాలో నటించాను. అందుకు సంబంధించిన రెమ్యూనరేషన్ కూడా నాకు ఇవ్వలేదు. ఇప్పుడు నాకు చాలా ఫేమ్ రావడంతో వారు ఆ సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ చేయమంటున్నారు.

ఇకపోతే నన్ను ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేస్తాము అని అంటున్నారు అని ఆమె ఒక పోస్ట్ చేసింది. అలాగే నేను ఈ సినిమాకు పబ్లిసిటీ చేయను అనే విషయాన్ని కూడా ఈమె ఇన్ డైరెక్టుగా చెప్పేసింది. ఇక ఈ మూవీ బృందం వారు మాత్రం ఖచ్చితంగా పబ్లిసిటీ చేయాల్సిందే అన్నట్లు పట్టు పట్టారు. కానీ పాయల్ రాజ్పూత్ మాత్రం తన పట్టుమే గట్టిగా నిలబడింది. ఈ రోజు సినిమా విడుదల అవుతున్న కూడా ఈమె ఎక్కడ ప్రచారాలను చేయలేదు. మరి ఈ సినిమా ఏమైనా హిట్ అయ్యి ఈమెకు మంచి గుర్తింపు తీసుకు వస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: