ఆ ఓటిటిలోకి ఎంట్రీ ఇచ్చిన బడే మియా చోటే మియా..!

Pulgam Srinivas
అక్షయ్ కుమార్ , టైగర్ షర్ఫ్ హీరోలుగా బడే మియా చోటే మియా అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో చాలా వరకు విఫలం అయింది.

దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ మొత్తంలో కలక్షన్ లను వసూలు చేయలేక పోయింది. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఇంపాక్ట్ ను చూపించలేకపోయినప్పటికీ ఈ సినిమాలో యాక్షన్స్ సన్నివేషాలు మాత్రం సూపర్ గా ఉన్నాయి. వాటిని తీసే విధానంలో దర్శకుడు చాలా ప్రతిభను చూపించాడు అనే ప్రశంసలు మాత్రం చాలా వరకు వచ్చాయి. అలాగే ఈ యాక్షన్స్ సన్నివేశాలలో అక్షయ్ , టైగర్ ఇద్దరు కూడా చాలా కష్టపడ్డారు అని కూడా ప్రేక్షకులు చెప్పుకొచ్చారు. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా తాజాగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ ఓ టీ టీ సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను ఈ రోజు నుండి ఈ సంస్థ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: