సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసిన సింగర్ మంగ్లీ..!?

Anilkumar
సింగర్ మంగ్లీ గురించి కొత్తగా  పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకవైపు ఫ్లోక్ సాంగ్స్ మరోవైపు సినిమాల్లో పాడుతూ ఎంతో క్రేజ్ ను సొంతం చేసుకోండి. ఎక్కడ చూసినా తన ఆట పాటలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా సాయి కిషోర్ మచ్చా దర్శకత్వంలో చేతన్ కృష్ణ హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న 'ధూం ధాం' సినిమా గురించి తెలిసిందే. ఈ సినిమాను ఎం.ఎస్.రామకుమార్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అంతా పూర్తయింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ లిరికల్

 సాంగ్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఆ పాటని మంగ్లీ పాడుతూ... ఆ పాటలో నర్తించినట్టు ఈ ప్రోమోలో తెలుస్తోంది. ఇక ప్రోమో ఏంటంటే... 'మల్లెపూల టాక్సీ తేరా మల్లేశా'.... అంటూ సాగుతోంది ఈ పాట. రామజోగయ్య శాస్త్రి ఈ సాంగ్ ను రాయగా గోపి సుందర్ స్వరపరిచారు. కాగా ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో సాయికుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్ గోపరాజు మరణం, శివ నారాయణ, బెనర్జీ తదితరులు కొన్ని కీలక పాత్రలను నటించారు. ప్రవీణ్ వర్మ ఈ సినిమాకి మాటలు అందించగా సిద్ధార్థ

 రామస్వామి కెమెరామెన్ గా ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ వారు నిర్మించారు. ఇదిలా ఉంటే మంగ్లీ ఒక బంజారా అమ్మాయి అయినప్పటికీ కూడా అటువంటి పండుగ వచ్చినా సరే తన పాట ముందు ఉంటుంది. సంక్రాంతి, దసరా, సమ్మక్క సారక్క జాతర ,శివరాత్రి అంటూ ఏ పండగలు ఉన్న సరే తను పాటలు పాడడానికి ముందుంటుంది. మంగ్లీ అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లె తాండలో పేద బంజారా కుటుంబంలో పుట్టింది. చదివింది 5 వరకు తాండ లోని ప్రభుత్వ స్కూల్ లొనే..5 నుండి 10 వరకు గుత్తి లోని గర్ల్స్ హై స్కూల్. RDT సంస్థ ద్వారా చదువుకొని పాటలు పాడటం నేర్చుకుంది. తిరుపతిలో కర్నాటిక్ సంగీతం నేర్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: