ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చైతు..!?

Anilkumar
నాగచైతన్య తన మొదటి సినిమా ప్లాప్ అయినప్పటికీ కూడా ఏమాత్రం నిరాశ చెందకుండా తన రెండో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఆ తరువాత వరుస హిట్ సినిమాలు చేసి తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక దాని తర్వాత హీరోయిన్ సమంత నీ అందరి సమక్షంలో ప్రేమ వివాహం చేసుకొని కొన్ని అనివార్య  కారణాలవల్ల ఇద్దరూ విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే నాగచైతన్య తనకు నచ్చిన కథలకి ఓకే చెబుతూ నిజాయితీగా తన సినిమా చేసుకొంటూ దూసుకుపోతున్నాడు  . అయితే

 తాజాగా చందు మొండేటి దర్శకత్వంలో 'తండేల్' సినిమాలో నాగచైతన్య నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇక నాగచైతన్య సినిమా నటిస్తుండగానే  మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆయన ఎవరో కాదు 100కోట్ల విజయాన్ని అందుకున్న విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో చైతన్య నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి  టైటిల్నిర్ణయించి ఈ మూవీ షూటింగ్ వైజాగ్ లో స్టార్ట్ కాబోతోంది. అయితే నాగచైతన్య ఇతర ప్రధాన

 తారాగణంపై ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. అంతేకాకుండా ఈ సినిమాలో నాగచైతన్య తో ఒక స్పెషల్ సాంగ్ ని కూడా ఈ షెడ్యూల్ లోనే ప్లాన్ చేశారట దర్శకుడు కార్తీక్ దండు. ఇక ఈ సినిమాలో నాగచైతన్య కొత్త లుక్ తో కనిపిస్తారట. నాగ చైతన్య కు దర్శకుడు కార్తీక్ దండు కొత్త మేకవర్ ఇస్తున్నారని యూనిట్ సభ్యులంతా సమాచారం. ఇక ఈ సినిమాకు హీరోయిన్ గా పూజా హెగ్డే ను ఖరారు అయినట్టు వార్తలు వస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పథకంపై బీవీఎస్ఎస్  ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే చందు మొండిటి దర్శకత్వంలో తండేల్ సినిమా డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: