ముందుగానే వస్తున్న దేవర.. 1000 కోట్లు పక్కానా?

Purushottham Vinay
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంకా కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమా దసరా బరిలో అక్టోబర్ 10న రిలీజ్ లాక్ చేశారు. కానీ మళ్ళీ ఈ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కానున్నట్లు సమాచారం తెలుస్తుంది. rrr  సినిమా తర్వాత జూనియర్ చేస్తున్న ఈ సినిమాపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఏర్పడ్డాయి.జనతా గ్యారేజ్ లాంటి హిట్ అందుకున్న ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. కథకు తగినట్టుగా దేవర టైటిల్ ఫిక్స్ చేసే సరికి అంచనాలు ఇంకా డబుల్ అయ్యాయి. ఇక ప్రచార చిత్రాలుగా వదిలిన టీజర్, దేవర ముంగిట నువ్వెంత సాంగ్ కూడా సినిమాకి మంచి హైప్ తెచ్చాయి.పైగా ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ దేవర సినిమాతో ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని మెప్పించాలని చూస్తున్నాడు. అందుకే సినిమా ప్రతి విషయంలో ఎన్టీఆర్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతున్నారని తెలుస్తుంది.


ఇదిలా ఉంటే ఎన్టీఆర్ దేవర టార్గెట్ విషయానికి వస్తే.. rrr తో 1000 కోట్ల మార్క్ రీచ్ అయిన తారక్ సోలోగా ఆ టార్గెట్ రీచ్ అవుతాడా లేదా అన్నది ఇప్పుడు చూడాలి.దేవర సబ్జెక్ట్ తో పాటుగా సినిమా కూడా అనుకున్న దాని కన్నా బెటర్ గా వస్తుందని సమాచారం తెలుస్తుంది. ఈ సినిమా ఆడియన్స్ కు కనెక్ట్ అయితే మాత్రం అనుకున్న టార్గెట్ పెద్ద కష్టమేమి కాదని తెలుస్తుంది. బాహుబలి రెండు భాగాలతో 2000 కోట్లు కొట్టిన ప్రభాస్ కూడా ఆ తర్వాత 600 కోట్లను మించి వసూళ్లను ఇప్పటిదాకా రాబట్టలేదు. అలాంటి ఎన్టీఆర్ దేవర మూవీతో సోలోగా 1000 కోట్లు కొడతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.ఆర్ ఆర్ ఆర్ తరువాత పాన్ ఇండియా లెవెల్ లో తారక్ ని ఇష్టపడే ఆడియన్స్ చాలామంది ఉన్నారు. వారందరికీ దేవర చూడాలన్న ఆసక్తి కలిగిస్తే చాలు సినిమా ఎంత భారీ టార్గెట్ పెట్టుకున్నా ఈజీగా రీచ్ అవుతుంది. అందుకే దేవర ప్రమోషనల్ కంటెంట్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు మేకర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: