మంచు విష్ణు కన్నప్ప పై పెరిగిపోతున్న అంచనాలు..!?

Anilkumar
ఒకప్పుడు వరుస సినిమాలు చేసి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు విష్ణు ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్  ప్రారంభించాడు. మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వరస సినిమాలు చేసి పలకరించాలి అని అనుకుంటున్నాడు. అయితే ఇదివరకు చేసిన సినిమాలతో అంతగా హిట్ అందుకో లేకపోయినా  విష్ణు ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్న మంచి విష్ణు ఈ సినిమా పైనే భారీ అంచనాలను పెట్టుకున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ

 సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ను రోజుకి ఒకటి విడుదల చేసి సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకు వెళుతున్నారు.  అంతేకాదు కన్నప్పలో చాలామంది పాన్ ఇండియా స్టార్స్ ని దింపుతున్నట్లుగా సమాచారం వినబడుతోంది. అంతేకాదు చాలామంది బాలీవుడ్ స్టార్స్ కూడా ఇందులో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకి సంబంధించిన చర్చలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. 150 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా దాదాపుగా 300 కోట్ల వరకు కలెక్షన్స్ ని

 రాబట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇదే కనుక జరిగితే మంచు విష్ణు బ్లాక్ బాస్టర్ ని సాధించినట్లే. ఇక ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు చేయని మంచు విష్ణు ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకోవాలి అని ఎదురు చూస్తున్నాడు. అయితే ఇందులో మంచు విష్ణు తో పాటు ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ కూడా గెస్ట్ రోల్లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ప్రభాస్ అక్షయ్ కుమార్ లకి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది.  ఇప్పటికే వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా ప్రభాస్ అసలు ఈ సినిమా ఎలా చేస్తున్నాడు అని చాలామంది సందిగ్ధంలో పడిపోయారు. ఏదేమైనా ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడు అంటే ఈ సినిమాలో ఏదో ఉంది అని అంటున్నారు ఫాన్స్.!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: