కల్కి: క్యామియో పాత్రల్లో ఆ స్టార్ హీరోయిన్స్..!?

Anilkumar
మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమా చేస్తున్నాడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్. సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ప్రభాస్ మళ్ళీ ఇప్పుడు 27వ తేదీన కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దీంతో ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇందులో భాగంగానే సినిమాకి సంబంధించిన ఏవో ఒక అప్డేట్ తరచూ సోషల్ మీడియాలో వినబడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మరొక వార్త తెరపైకి వచ్చింది.  ఈ సినిమాలో

 ఇప్పటికే భారీ స్టార్ కాస్టింగ్ ఉంది అని మనందరికీ తెలిసిందే. కీలక పాత్రల సంగతి పక్కన పెడితే  ఇందులో స్టార్ నటీనటుల కామియో కూడా ఉన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికే ఇందులో విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ లు కామియో పాత్రల్లో కనిపించబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఆ లిస్టులోకి మరో ఇద్దరు స్టార్ లు చేరినట్లుగా సమాచారం. ఇక ఈ వార్త ఎలా వెలుగులోకి వచ్చింది అంటే.. తాజాగా మృనాల్

 ఠాగూర్ సోషల్ మీడియా వేదికగా ఒక అప్డేట్ షేర్ చేసింది. దాంతో ఈ వార్తలకు తెరతీసింది. ఇక ఇందులో మృణాలు నటిస్తుందో లేదో ఇప్పటివరకు క్లారిటీ అయితే లేదు కానీ మన సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ కల్కి సినిమాను ప్రమోట్ చేయడంతో అందరూ ఈ వార్త నిజమే అని అనుకుంటున్నారు. ఇక ఇందులో హీరోయిన్గా దీపిక పదుకొనే నటించింది. కానీ దీపిక మాత్రం ఇప్పటివరకు కల్కి సినిమాని ఎక్కడ కూడా ప్రమోట్ చేయలేదు. కానీ మృణాల్ మాత్రం తన సోషల్ మీడియా వేదికగా కల్కిని ప్రమోట్ చేయడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారు ఏంటి అన్న విషయం తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: