ఆ తేదీన ఓటీటీ లోకి హారర్ ధ్రిల్లర్ మూవీ..?

Pulgam Srinivas
ప్రేమిస్తే మూవీ ఫేమ్ భరత్ గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈయన తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు . భారత్ నేరు గా తెలుగు సినిమాలలో పెద్ద గా నటించకపోయిన ప్పటికీ ఇతను నటించిన తమిళ సినిమాలు చాలానే తెలుగు లో విడుదల అయ్యాయి . వాటి ద్వారా ఇతనికి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు లభించింది . 

తాజాగా ఈయన మిరల్ అనే సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు . ఇక పోతే ఈ మూవీ హర్రర్ ట్రైలర్ సినిమాగా రూపొందింది . పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపలేక పోయింది . దానితో ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది . ఇలా తెలుగు ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ ఓ టీ టీ హక్కులను ఆహా సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది . అందు లో భాగంగా జూన్ 7 వ తేదీ నుండి ఈ సినిమాను ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ వారు తెలుగు భాషలో స్ట్రీమింగ్ చేయనున్నట్టు తెలుస్తుంది .  మరి ఈ మూవీ కి ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో తెలుగు ప్రేక్షకుల నుండి ఏ స్థాయి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి . ఇక ప్రస్తుతం ఈ మూవీ తమిళ బాషలో ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: