ఆ హీరోయిన్ తో.. మళ్లీ దొరికిపోయిన చైతూ?

praveen
హీరోయిన్ సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య మరో పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నాడు. అయితే ఇలా ఒంటరిగా ఉంటున్న నాగచైతన్య ఒక హీరోయిన్తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నాడు అంటూ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. హీరోయిన్ ఎవరో కాదు షోబిత ధూళిపాల.  గూడచారి లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఇక ఇప్పుడు ఈ హీరోయిన్ అక్కినేని హీరో ప్రేమలో ఉంది అంటూ వార్తలు వచ్చాయి.

 అయితే ఇలాంటి వార్తల పై స్పందించిన అక్కినేని హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాల ఇదంతా కేవలం అవాస్తవం మాత్రమే.. మా ఇద్దరి మధ్య పరిచయమే లేదు ఇక లవ్ ఎలా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. కానీ వీరిద్దరూ కలిసి ఒకే ట్రిప్ కు వెళ్లడం ఇక ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఎంతోమంది నెటిజెన్స్ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ ఫిక్స్ అయిపోయారు. అయితే మొన్నటి వరకు ఒకే లొకేషన్ లో విడివిడిగా ఉన్న ఫోటోలను షేర్ చేసేవారు. దీంతో ఫోటోలని బ్యాగ్రౌండ్ ని బట్టి వేరువేరుగా ఫోటోలను షేర్ చేసిన ఇక కలిసే ట్రిప్ కు వెళ్లేవారు అని అభిమానులు అనుకునేవారు.

 అయితే తాజాగా ఈ జంట మరోసారి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. యూరప్ లోని ఒక బార్ లో వైన్ టెస్టింగ్ సెషన్ లో నాగచైతన్య, శోభిత  పాల్గొన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది చూసిన నెటిజెన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు. అయితే వీళ్ళు ఎప్పటినుంచో కలిసే తిరుగుతున్నారు. ఇప్పటికి ట్రిప్పులకు జంటగా వెళ్తున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా ఒకే చోట వైన్ తాగుతూ కనిపించి దొరికిపోయారు అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం నాగచైతన్య తాండెల్ అనే మూవీతో బిజీగా ఉండగా.. శోభిత సితార అనే మూవీలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: