పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఓ జి నుండి స్పెషల్ పోస్టర్.. ఎప్పుడంటే..!?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాని డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సైతం అందజేశారు. ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ నేపద్యంలో రాబోతోంది. దానికి ఓజీ అనే టైటిల్  అయితే ఫిక్స్ చేశారు మేకర్స్. అనౌన్స్మెంట్ తోనే సంచలనాన్ని సృష్టించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్స్ లో విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు అయితే దానికి

 సంబంధించిన అధికారిక ప్రకటన బయటికి రాలేదు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మరొక వార్తా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే మూవీ మేకర్స్ ఈరోజు ఓజి సినిమా నుండి ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేయాలి అని ప్లాన్ చేసినట్టుగా సమాచారం వినబడుతోంది. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. ఫ్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వారితోపాటు

 ఇమ్రాన్ హష్మీ ప్రకాష్ రాజ్ అర్జున్ దాస్ శ్రీయ రెడ్డి హరీష్ ఉత్తమన్ తదితరులు ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు. కాగా భారీ బడ్జెట్తో భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. డి వి వి ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తో  నిర్మిస్తున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎంతో కాలంగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసాడు. రాజకీయాల తర్వాత ఈ సినిమాతో మొదటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి రాజకీయాల తర్వాత పవర్ స్టార్ చేస్తున్న సినిమా కాబట్టి ఇప్పటికే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి దీంతో పవర్ స్టార్ ఎటువంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: