ఏంటి.. ప్రభాస్ కల్కి తో ఆ సీనియర్ నటి రీ ఎంట్రీ ఇస్తోందా..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా కల్కి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ నిర్మిస్తున్నారు. సుమారుగా 600 కోట్లకు పైగానే బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు భారీ స్టార్ కాస్టింగ్ కూడా ఉంది. అమితాబచ్చన్ దీపికా పదుకొనే దిశా పటాన్ని వంటి వారితోపాటు లోక నాయకుడు కమల్ హాసన్, సైతం ఇందులో పలు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మిగిలిన పాత్రల గురించి క్లారిటీ ఇవ్వలేక పోయినప్పటికీ ఈ స్టార్ కాస్ట్ కచ్చితంగా

 ఉంటాయి అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో భారీ స్టార్ కాస్టింగ్ తో పాటు మరికొందరు స్టార్స్ కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఇవే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ ఇప్పటివరకు దానికి సంబంధించిన ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ సైతం గెస్ట్ పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వాళ్లతో పాటు రానా కూడా

 కనిపిస్తారట. అంతే కాదు నాని కూడా ఇందులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇకపోతే కీర్తి సురేష్ బుజ్జి పాత్రకి వాయిస్ అందిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. వీళ్లే కాదు మరెందరో స్టార్స్ ఇందులో కనిపించబోతున్నట్లుగా సమాచారం వినబడుతోంది. అయితే తాజాగా ఇప్పుడు మరొక స్టార్ పేరు కూడా వినబడుతోంది. అదే రాజమౌళి. రాజమౌళి మాత్రమే కాకుండా రామ్ గోపాల్ వర్మ సైతం ఇందులో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారట. దాంతో పాటు బ్రహ్మానందం కూడా ఉన్నట్లుగా ఇటీవల ఒక వీడియో ద్వారా తెలిపారు.  అయితే వీళ్లే కాకుండా అలనాటి నటి శోభన సైతం ఇందులో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈమె లో ఒక కీలక పాత్రలో కనిపించబోతుందట. మరి ఇంత మంది స్టార్ క్యాస్ట్ కూడా ఉన్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: