మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న తర్వాత రామ్ చరణ్ 'గేమ్ చేజర్ ' సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాను శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా మూడేళ్లుగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుపుకుంటునే ఉంది. ఇంతకు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కానుంది అనే దానిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. అయితే పోయిన నెలలో ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ ని పూర్తి చేశారు శంకర్. అయితే శంకర్ ప్రస్తుతం కమల్
హాసన్ 'ఇండియన్ 2' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన రామ్ చరణ్ అభిమానులు ఇండియన్ 2 సినిమా విడుదల అయ్యేవరకు గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలయ్యేలాలేదు అని ఆందోళనకు గురవుతున్నారు. ఇక అభిమానులు అలా భయపడాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ నెలలో గేమ్ చేజర్ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ షూటింగ్ రాజమండ్రిలో ప్లాన్ చేసారు. ఇక ఈ షూటింగ్ దాదాపుగా వారం రోజులపాటు జరగనుంది. ఈ సినిమాలో కొన్ని కీలక
సన్నివేశాలు ఈ షెడ్యూల్లో తెరకెక్కించనున్నారు. ఈ షూటింగ్లో భాగంగా రామ్ చరణ్ తో పాటు ఈ సినిమాలో పలు కీలక పాత్రలో నటిస్తున్న నటులు కూడా పాల్గొంటున్నారు. అయితే తాజాగా దిల్ రాజు ఈ సినిమాను అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. దీనితోపాటు ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా కూడా అక్టోబర్లో రిలీజ్ కానుంది. అయితే గేమ్ చెంజర్ సినిమా కూడా అప్పుడే రిలీజ్ అయితే చరణ్ , ఎన్టీఆర్ వీళ్ళిద్దరి మధ్యలో పోటీ తప్పదు. అయితే పోయిన ఏడాదిలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఆ సినిమా తరువాత వీళ్ళిద్దరూ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఈ రెండు సినిమాలే. ఒకవేళ వీళ్ళిద్దరి సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే దానిని చూడడానికి టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.