మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా ఆ బాలీవుడ్ బ్యూటీ..!?

Anilkumar
త్రిబుల్ ఆర్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు తో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే  సినిమాకి సంబంధించిన ఏవో ఒక వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వినబడుతూనే ఉంటాయి. అంతేకాదు ఈ సినిమా కోసం మహేష్ బాబు ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకుంటున్నారు అన్న వార్తలు సైతం సోషల్ మీడియాలో తెగ వినబడుతున్నాయి. అలాగే ఇప్పుడు మహేష్ బాబు ఈ సినిమా కోసం తన

 లుక్ ను పూర్తిగా మార్చేసాడు. లాంగ్ హెయిర్ తో అచ్చం హాలీవుడ్ రేంజ్  హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లుగా సమాచారం వినబడుతోంది. కానీ దానికి సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. అంతేకాదు త్వరలోనే ఈ సినిమాను స్టార్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వినబడుతుంది. అయితే మహేష్ బాబు

 ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నదానిపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఒక బాలీవుడ్ బ్యూటీ ను ఈ సినిమా కోసం తీసుకున్నారు అన్న వార్తలు వినబడుతున్నాయి. ఇక ఆ హీరోయిన్ మరెవరో కాదు. ఇప్పుడిప్పుడే సౌత్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్. ఇప్పటికే బాలీవుడ్లో పలు సినిమాలో చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఇటీవల తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. దాంతో పాటు రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలో సైతం హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది ఈ బ్యూటీ. మరి ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి సినిమాలో కూడా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన క్లారిటీ రావాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకు ఆగాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: