ఎంతో కాలంగా అలాంటి సమస్యతో బాధపడుతున్న శృతిహాసన్..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం హీరోయిన్ గానే కాకుండా సింగర్ గా కూడా భారీ గుర్తింపు సంపాదించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇటీవల సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం  చేసుకుంది. ప్రస్తుతం సలార్ టు తో బిజీగా ఉంది శృతిహాసన్. విశ్వనాథుడు కమలహాసన్ వారసురాలుగా సినిమా ఇండస్ట్రీకి పరీక్షమై భారి క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఎప్పుడు

 సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటుంది శృతిహాసన్. తనకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అదేవిధంగా తన ప్రియుడు శాంతను తో బ్రేకప్ కూడా చేసుకుంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినబడుతున్నప్పటికీ తన ప్రేమ బ్రేకప్ పై ఇప్పటికీ స్పందించలేదు శృతిహాసన్. ఈ క్రమంలోనే శృతిహాసన్ కి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వినబడుతోంది. అయితే ఈమె  గత కొంతకాలంగా ఒక సమస్యతో

 బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది.  తనకి బ్యాడ్ పీరియడ్స్ సమస్య ఉంది అని.. మొదటి నుండి ఈ సమస్యతో పోరాటం చేస్తూనే ఉంది అని తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికీ ఆ బాధను భరిస్తున్నట్లుగా బ్యాడ్ పీరియడ్ సమయంలో ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నాను అని.. ఇదే కారణంగా చాలా విషయాలను కోల్పోవాల్సి వస్తుంది అని తాజాగా శృతిహాసన్ తెలిపింది .అంతేకాదు కోట్ల రూపాయలతో సినిమాలు చేస్తున్నారు. వాళ్లకి తన పీరియడ్స్ సమస్య ఉంది అని చెప్పి షూటింగ్ ఆపేయండి అని చెప్పగలనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది. దీంతో ఇదే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు చాలామంది స్టార్స్ భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమాలు కాబట్టి బాధను కూడా భరిస్తూ పాటలకు డాన్స్ వేస్తున్నట్లుగా తెలిపింది శృతిహాసన్. దీంతో శృతిహాసన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: