NKR 21: మళ్ళీ కొత్త స్టోరీ.. ఈసారి హిట్టు కొట్టేలా ఉన్నాడే?

Purushottham Vinay
టాలీవుడ్ లో అసలు జయాపజయాలతో ఎలాంటి సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే అతి కొద్దిమంది హీరోల్లో నందమూరి వారి పెద్ద మనవడు కళ్యాణ్ రామ్ ఒకరు. బింబిసార లాంటి విభిన్నమైన మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ హిట్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్..ఆ తర్వాత అమిగోస్‌ సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో నటించి ఎంతగానో మెప్పించారు. డోపర్ గ్యాంగల్ అంటూ తెలుగు తెరకు కొత్త కాన్సెప్ట్‌తో పలకరించినా కూడా ప్రేక్షకులు ఆదరించలేదు. ఇక ఆ తర్వాత 'డెవిల్' అనే ఇంకో డిఫరెంట్ మూవీతో పలకరించారు. ఈ సినిమాకు టాక్‌ బాగున్నా కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన తగిన వసూళ్లు రాక విజయం సాధించలేదు. ఈ మూవీ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న కళ్యాణ్‌ రామ్.. త్వరలో తన కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీతో ప్రదీప్ చిలుకూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అటు ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను అశోక్ వర్ధన్ ముప్పా ఇంకా సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.


 ఈ సినిమా మేకింగ్ షార్ట్‌లో చేతిలో రుద్రాక్ష మాలతో పిడికిలితో కళ్యాణ్ రామ్ సూపర్ టెర్రిఫిక్‌గా కనిస్తున్నాడు.ఇక ఈ సినిమాకు కన్నడ బ్లాక్ బస్టర్ కాంతార కి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసి మంగళవారం సినిమాతో మెప్పించిన అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ విజయ శాంతి కీలక పాత్రలో నటిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'సరిలేరే నీకెవ్వరు' తర్వాత విజయశాంతి యాక్ట్ చేస్తోన్న మూవీ ఇదే కావడం గమనార్హం. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇక మరోవైపు కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీకి సీక్వెల్‌గా బింబిసార 2 మూవీ కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను వశిష్ఠ కాకుండా మరో దర్శకుడు ఈ టేకప్ చేసే ఛాన్సెస్ ఉన్నట్టు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మొత్తంగా 'బింబిసార' సినిమా తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం కళ్యాణ్ రామ్ ఎంతగానో వెయిట్ చేస్తున్నాడు. హీరోగా కళ్యాణ్ రామ్‌కు ఇది 21వ సినిమా. ఇంకా నటుడిగా 24వ చిత్రం కావడం గమనార్హం. ఈ గ్లింప్స్ ఆకట్టుకోవడంతో ఖచ్చితంగా కళ్యాణ్ రామ్ హిట్టు కొడతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: