తాతపై తారక్ ఇంట్రెస్టింగ్ ట్వీట్?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్ పరంగా బాగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజు తన తాత గారు సీనియర్ ఎన్టీఆర్  101వ జయంతి కాగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తాతకు నివాళులు అర్పించారు.తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని తమ తాతను స్మరించుకున్నారు. మరోవైపు తాతను తలచుకుంటూ ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ చేసిన పోస్ట్ చాలా ఆసక్తికంగా ఉండి నెట్టింటా తెగ వైరల్ అవుతోంది.“మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది.. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది.. పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను” అంటూ సోషల్ మీడియా వేదికగా సీనియర్ ఎన్టీఆర్ ఫోటోతో ఉన్న పోస్ట్ ను జూనియర్ ఎన్టీఆర్ షేర్ చేశారు. తాతపై ఉన్న ప్రేమను ఇంకా అభిమానాన్ని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ విధంగా చాటుకోవడం గమనార్హం.

కెరీర్ పరంగా జూనియర్ ఎన్టీఆర్ ఎంత బిజీగా ఉన్నా తాత పుట్టినరోజున ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు కచ్చితంగా చేరుకుని ఆయనకు నివాళులు అర్పిస్తారు. మరోవైపు దేవర సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న నేపథ్యంలో అతి త్వరలో సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ కానుందని సమాచారం తెలుస్తోంది. దేవర ఫస్ట్ సింగిల్ యూట్యూబ్ లో భారీ స్థాయిలో వ్యూస్ రాబడుతుంది.సిల్వర్ స్క్రీన్ పై ఈ పాట చాలా అద్భుతంగా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కొరటాల శివతో మరోసారి కలిసి పని చేస్తున్న ఎన్టీఆర్ కి ఈ సినిమా  భారీ విజయాన్ని అందిస్తుందేమో చూడాలి. సముద్రతీరం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో కొత్త కథను చూసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుందని కామెంట్లు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. ఇక మరోవైపు మరికొన్ని రోజుల్లో దేవర క్లైమాక్స్ షూట్ జరగనుందని ఎంతో భారీ స్థాయిలో ఈ క్లైమాక్స్ ను ప్లాన్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.అండమాన్ అండ్ నికోబర్ లో ఒక రొమాంటిక్ సాంగ్ షూట్ కావాల్సింది కానీ వాతావరణ పరిస్థితిలు బాగోలేకపోవడం వల్ల షూట్ ఆగిపోయింది.మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: