పెళ్లి అయ్యాక అలాంటి క్యారెక్టర్స్ అడుగుతారు.. కాజల్ పై బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్..!?

Anilkumar
చందమామ కాజల్ అగర్వాల్ నటించిన లేటెస్ట్ సినిమా సత్యభామ. పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ నటిస్తున్న రెండవ సినిమా ఇది. దీంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా సత్యభామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి నటసింహం నందమూరి  బాలకృష్ణ రావడంతో మరింత విశేషంగా మారింది. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు కాజల్ అభిమానులు. కాగా క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా జూన్ 7న విడుదల కాబోతోంది .ఈ నేపథ్యంలోనే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్

 కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మే 24న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక దీనికి ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ అనిల్ రావిపూడి వచ్చారు. ఇక ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన భగవంత్ కేసరి సినిమా ఎంతటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాజల్ ట్రీ ఎంట్రీ ఇచ్చింది  ఈ సినిమాతోనే. అందుకే వాళ్ళిద్దరూ సత్యభామ ట్రైలర్ లాంచ్ కి ముఖ్య అతిథులుగా వచ్చారు. ఇక ఈ ట్రైలర్ లాంచ్ వేడుకల్లో బాలకృష్ణ కాజల్ పై కొన్ని ఆసక్తికరమైన

 వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "సత్యభామ ట్రైలర్ చాలా బాగుంది. కాజల్ ఒక ఫైర్ బ్రాండ్. అన్ని రకాల ఎమోషన్స్ చేయగల నటి. పాత్రల ఆత్మలోకి వెళ్లి మరి మెప్పించగలదు. 16 ఏళ్లలో అనేక వైవిధ్యమైన పాత్రల్లో నటించింది. అన్నింటిలోకి పరకాయ ప్రవేశం చేసింది. వైవాహిక జీవితంలోకి వెళ్లి ఒక బిడ్డకు జన్మనిచ్చి మళ్లీ మా భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది" అని నందమూరి బాలకృష్ణ తెలిపారు. "హీరోయిన్స్‌కు పెళ్లయ్యాక సపోర్టింగ్ క్యారెక్టర్స్ కోసం అడుగుతుంటారు. ఆ టైప్ కాస్ట్‌ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆమెకున్న ఎనర్జీకి హ్యాట్సాఫ్. మొదటి నుంచి ఆమె సినిమాలు చూస్తున్నాను. కాజల్‌తో నటించాలని ఉండేది.  ఆ కోరిక భగవంత్ కేసరి సినిమాతో తీరింది అంటూ కాజల్ పై కామెంట్స్ చేశారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: