వర్మతో సినిమాకి సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..!?

Anilkumar
కొన్ని కాంబినేషన్స్ అసలు సెట్ అవుతాయి అని కల్లో కూడా ఊహించడం కష్టం. అలాంటిది వాళ్ళ కాంబినేషన్ లో సినిమా పడితే కచ్చితంగా అందరూ షాక్ అవుతారు. అయితే ఇప్పుడు అలాంటి ఒక కాంబినేషన్ సెట్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. అది మరెవరో కాదు విజయ్ సేతుపతి రామ్ గోపాల్ వర్మ. అయితే గత కొంత కాలం క్రితం విజయ్ సేతుపతి నేను నెగిటివ్ రోల్స్ చేయను అని.. కొంతకాలం ఆ పాత్రలకు ఫుల్స్టాప్ పెడుతున్నాను అని.. ప్రస్తుతం ఫుల్ లెన్త్ రోల్స్ ఉంటేనే సినిమాలు చేస్తాను అని.. క్లియర్ గా చెప్పేసాడు. కానీ

 ఇప్పుడు ఆయన వింటున్న కథలన్నీ మెయిన్ లీడర్ కోసమే అని అంటున్నారు. అయితే సరిగ్గా ఇప్పుడు అలాంటి కథ కోసమే రామ్ గోపాల్ వర్మ ని కలిశారు మక్కల్ సెల్వన్ .అయితే ఎప్పటినుండో రాంగోపాల్ వర్మ కి గ్యాంగ్ స్టార్ తరహా రోల్స్ లో సినిమా చేయాలి అని ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆ సినిమాను విజయ్ సేతుపతితో చేయబోతున్నట్లుగా సమాచారం వినబడుతోంది. అయితే ప్రస్తుతం పొలిటికల్ పనులతో బిజీగా ఉన్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడిప్పుడే ఆ పనులతో కాస్త ఫ్రీ అవుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఫుల్

 లెన్త్ కమర్షియల్ సినిమాలని ప్లాన్ చేస్తూ కమర్షియల్ అంశాలతో సినిమాలు చేయాలి అని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇటీవల ఆయన విజయ్ సేతుపతి గురించి మాట్లాడుతూ.. చాలాసార్లు ఆయనని స్క్రీన్ మీద చూశాను.. ఇప్పుడు నేరుగా చూశాను.. స్క్రీన్ మీద చూడడం కన్నా నిజంగా చూస్తేనే బాగా అనిపించింది.. మిస్టర్ సేతుపతి అంటూ ఆయన పై ప్రశంసల వర్షం కురిపించాడు రామ్ గోపాల్ వర్మ. అలాంటిది ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా పడితే కచ్చితంగా అది బ్లాక్ బస్టర్ అవుతుంది అని అందరూ భావిస్తున్నారు. ఇక విజయ్ సేతుపతి విషయానికి వస్తే.. తమిళంలో భారీ గుర్తింపు తెచ్చుకున్న ఆయన సైరా నరసింహారెడ్డి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ఉప్పెన సినిమాలో కీలక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఈ సినిమాతో ఆయనకి తెలుగులో సైతం భారీగా క్రేజ్ పెరిగిపోయింది. దాంతో ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేశాడు. ప్రస్తుతం తమిళంలో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: