పీరియడ్స్ సమయంలో ఈ అగ్ర హీరోయిన్లు ఏం చేస్తారో తెలిస్తే..?

Suma Kallamadi
సాధారణంగా నెలసరి సమయంలో ఆడవారు ఏ పని కూడా సరిగా చేయలేరు. పొత్తికడుపులో నొప్పి, రక్తస్రావం, మూడు స్వింగ్స్ కారణంగా వారు బాగా రెస్ట్ కోరుకుంటారు. ఫిజికల్లీ డిమాండింగ్ పనులు చేయడానికి ఇష్టపడరు. మరి సినిమా హీరోయిన్ల పరిస్థితి ఏంటి వారు ఒకేసారి చాలా సినిమాలు ఒప్పుకుంటారు. రోజులో కొన్ని గంటలు కూడా వారు వేస్ట్ చేయడానికి వీలు ఉండదు. ప్రతి కాల్ షీట్ కు హాజరవుతూ సన్నివేశాలకు సంబంధించిన పార్ట్స్ షూట్ చేయాల్సి ఉంటుంది.
హీరోయిన్లు సాధారణంగా డాన్సులు చేస్తుంటారు. హీరోల మాదిరి భౌతికంగా బాగానే కష్టపడతారు. పీరియడ్ సమయంలో కూడా వారు అలాగనే కష్టపడతారా? దీనిపై తాజాగా హీనా ఖాన్ అనే ఒక నటి పెదవి విప్పింది. ఆమె ఏం చెప్పిందో, అలానే మిగతా నటీమణులు కూడా పీరియడ్ సమయంలో ఎలా వర్క్స్ మేనేజ్ చేస్తారో తెలుసుకుందాం.
హీనా ఖాన్ ఇటీవల ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ షేర్ చేస్తూ "పిరియడ్స్‌ సమయంలో ఫస్ట్ 2 డేస్ నాకు షూటింగ్ లో పాల్గొనకుండా ఒక వెసులుబాటు కల్పిస్తే బాగుండు అనిపిస్తుంది. బయట షూటింగ్స్ చేసేటప్పుడు చాలా కష్టంగా, అసౌకర్యంగా అనిపిస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఎండాకాలంలో వేడి పొక్కులు డీహైడ్రేషన్, బాడీ పెయిన్స్, మూడ్‌ స్వింగ్స్, లో బీపీ వంటి సమస్యలు వేధిస్తాయి. ఇక నెలసరిలో ఉన్నప్పుడు పరిగెత్తాల్సిన సీన్లు చేయమంటే అది ఒక నరకమే. అందుకే ఈ సమయంలో షూటింగ్స్ నుంచి నటీమణులను మినహాయించాలని కోరుకుంటా" అని హీనా చెప్పుకొచ్చింది.
సాయి పల్లవి కూడా కొద్ది రోజుల క్రితం పిరియడ్స్ వాళ్ళ ఎంత అసౌకర్యం కలుగుతుందో తెలిపింది. నెలసరి సమయంలోనే తాను శ్యామ్‌ సింగరాయలో క్లాసికల్ డ్యాన్స్ చేశానని తెలిపింది. చాలా వరకు డ్యాన్స్ షూటింగ్స్ తన పీరియడ్స్ టైమ్‌లోనే వచ్చాయని ఆమె తెలిపింది. నెలసరి సమయంలో డాన్స్ చేసేటప్పుడు వెంటనే అలసిపోతానని పేర్కొంది. తన తండ్రి తన కాళ్లకు మసాజ్ చేస్తూ రిలీఫ్ కలిగిస్తాడని పేర్కొంది.
సలార్ బ్యూటీ శ్రుతి హాసన్ నెలసరి సమయంలో పొత్తికడుపు నొప్పితో చాలా బాధపడతానని ఒకానొక సమయంలో తెలిపింది. అయితే ఎంత పెయిన్ ఉన్నా షూటింగ్స్‌లో పాల్గొంటానని ఆమె చెబుతోంది. స్టంట్స్, యాక్షన్ సన్నివేశాలు తీసేటప్పుడు చాలా ఛాలెంజింగ్‌గా అనిపిస్తుందని ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇలాంటి సమయంలో కాసేపు ఏమి చేయకుండా పక్కన కూర్చోవాలనిపిస్తుంది అని వేడివేడి ఫుడ్ తినాలనిపిస్తుందని చెప్పింది.
ఇక దేని గురించైనా నిర్మొహమాటంగా మాటంగా మాట్లాడే రాధిక ఆప్టే నెలసరి సమయంలో కూడా చాలా ఓపెన్ గా ఉంటానని చెబుతోంది. కష్టమైన సన్నివేశాలు తనతో చేయించవద్దని దర్శకులకు ముందే చెబుతుందట. చెక్ దే ఇండియా సినిమాలో హాకీ టీం కెప్టెన్ గా నటించిన విద్యా మాల్వాడే కూడా బహిష్టు సమయంలో స్పోర్ట్స్ పార్టీ చేయడం స్పోర్ట్స్ సన్నివేశాలలో నటించడం కష్టమని తెలిపింది. అయితే ఈ మూవీ షూటింగ్ టైంలో అమ్మాయిలకు ఇబ్బంది కలగకుండా రెస్ట్ ఇచ్చారని ఆమె వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: