లవ్ మి: ప్రేక్షకుల సహనానికి పరీక్ష..?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ నిర్మాణంలో అతని తమ్ముడి కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా వచ్చిన రెండవ సినిమా లవ్ మి. నేడు విడుదల అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.దిల్ రాజు తాను ఎంత పెద్ద స్టార్ ప్రొడ్యూసర్ అయిన అతని ప్రతి సినిమా హిట్ అవ్వదు అనే భ్రమ నుంచి బయటకి రావాలి. కథ బాగుంటేనే జనాలు సినిమా చూసి హిట్టు చేస్తారు. అందరి సినిమాలు కథతో సంబంధం లేకుండా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాల్లా బాగా ఆడవు. ఆ విషయాన్ని దిల్ రాజు గుర్తు పెట్టుకోవాలి. ఇటీవల ఆయన నిర్మించిన ఫ్యామిలీ స్టార్ పెద్ద రోడ్ స్టార్ అయ్యింది. తాజాగా ఆయన తమ్ముడు కొడుకుతో తీసిన లవ్ మి సినిమా కూడా తాజాగా విడుదల అయ్యి ఫ్యామిలీ స్టార్ లాంటి మరో రాడ్డు ప్లాప్ అవ్వబోతుంది.ఇది హారర్ సినిమా అంటూ దిల్ రాజు అవతార్ రేంజ్ లో రుద్దాడు కానీ ఏమాత్రం భయం అనిపించదు. ఎందుకంటే ఇదొక రొట్ట రొటీన్ సినిమా. కీరవాణి తన ఆర్‌.ఆర్‌తో, పి.సి.శ్రీరామ్ తన కెమెరా మ్యాజిక్కులతో ఏదో హారర్ ఎఫెక్ట్‌ని సృష్టించాలని ట్రై చేసినా థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి ఇది హారర్ సినిమా అని ఏ షాట్ లోనూ అనిపించదు.  


ఈ సినిమాలోని దెయ్యంతో హీరో రొమాన్స్ చేయాలనుకొన్నప్పుడే ప్రేక్షకులు సహనం కోల్పోతారు. దెయ్యంతో ప్రేమలో పడడం, హీరో సిగ్గు పడుతూ దెయ్యాన్ని చూడడం, హీరోని చూసి దెయ్యం భయపడి పారిపోవడం, హీరోయిన్‌ని పిలిచినట్టు దెయ్యాన్ని డేట్‌కి పిలవడం, కాఫీ కలిపి ఇవ్వడం ఇవన్నీ చూస్తుంటే రెగ్యులర్ లవ్ స్టోరీని హారర్ సౌండ్ ఎఫెక్ట్స్ లో చూసిన చెత్త అనుభూతి కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా రొట్టగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లాజిక్ లెస్ సీన్లతో బోరింగ్ గా ఉంటుంది. హీరో హీరోయిన్ల యాక్టింగ్ కి దండం పెట్టాలనిపిస్తుంది. అంటే అంత చెండాలంగా ఉంటుంది.ఆశీష్ బాబు ఫస్ట్ మూవీ రౌడీ బాయ్స్ విడుదలకు ఎంత ఓవర్ రేటెడ్ అయ్యి విడుదల అయ్యాక ఎంత పెద్ద డిజైస్టర్ అయ్యిందో తేలిసిందే. ఇక ఈ సినిమా కూడా అంతకుమించి డిజాస్టర్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.కాస్తో కూస్తో మ్యూజిక్, సినిమాటోగ్రఫి తప్ప ఈ సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు ఏమి లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: