కరెక్ట్ టైం కి నార్త్ బుల్లితెరపై సలార్..!

MADDIBOINA AJAY KUMAR
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరో గా నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ప్రభాస్ ఆఖరుగా సలార్ పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా , ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

పోయిన సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ విడుదల సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమా ఆ తర్వాత ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ మూవీ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో కూడా మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత ఈ మూవీ తెలుగు భాషలో బుల్లి తెరపై కూడా ప్రసారం అయింది. ఇక ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన రెస్పాన్స్ తో పోలిస్తే తెలుగులో బుల్లి తెర మాత్రం ఆ స్థాయి రెస్పాన్స్ లభించలేదు.

ఇకపోతే ఈ మూవీ నార్త్ లో కూడా బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. కరెక్ట్ సమయాన్ని చూసి ఈ సినిమాని హిందీ లో ప్రసారం చేయబోతున్నారు. ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ సాటిలైట్ హక్కులను స్టార్ గోల్డ్ సంస్థ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా వీరు ఈ సినిమాను చాలా కరెక్టు టైం లో బుల్లి తెరపై ప్రసారం చేయనున్నారు. ప్రస్తుతం ఐ పీ ఎల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి.

దానితో టీవీల్లో సినిమాలు చూడడానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దానితో ఈ రోజు ఏ మ్యాచ్ లేకుండా ఖాళీగా ఉండటంతో ఈ రోజు అనగా మే 24 వ తేదీన సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు సలార్ మూవీ ని స్టార్ గోల్డ్ ఛానల్ వారు ప్రసారం చేయనున్నారు. ఇలా ఈ ఛానల్ వారు పక్కా ప్లానింగ్ తో ఈ సినిమాను ఈ రోజు ప్రసారం చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: