జూన్ 7 నుంచి ‘ఆహా’లో ఇండియన్ ఐడల్ సీజన్ 3..?
హోస్ట్ శ్రీరామ్ చంద్ర: ‘‘ఇండియన్ ఐడల్ 3 సీజన్లో మళ్లీ రావటం చాలా చాలా సంతోషంగా ఉంది. 2010 నుంచి ఇప్పటి దాకా ఈ ప్రోగ్రామ్‌తో చాలా ఎమోషన్స్ ఎటాచ్ అయ్యున్నాయి. ఈ సీజన్‌కు సంబంధించిన ఆడిషన్స్ జరిగినప్పుడు చాలా మంది కేవలం సింగర్స్ మాత్రమే కాదు.. చాలా మంది సంగీత కళకారులు ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఇండియన్ ఐడల్ సీజన్ 3 గొప్ప టాలెంట్‌ను తీసుకురాబోతున్నారు. తొలి రెండు సీజన్స్‌ను మించిన టాలెంటెడ్ పర్సన్స్ వచ్చారు. మూడు నాలుగు నెలల పాటు ఈ మ్యూజికల్ జర్నీ కొనసాగనుంది. ఆహా నాకు కుటుంబంలాంటిది. మంచి అనుబంధం ఉంది. ఇండియన్ ఐడల్ జర్నీతో పాటు నటుడిగానూ ఆహాలో ప్రేక్షకులను పలకరించాను. ఇలాంటి గొప్ప మాధ్యమంలో ఇంకా కొత్త టాలెంట్ పరిచయం అవుతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్ ’’.
సింగర్ గీతా మాధురి: ‘‘ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 చేసిన తర్వాత సీజన్ 3కి కాల్ వస్తుందని నేను అనుకోలేదు. అయితే నాకు ఆహా నుంచి కాల్ వచ్చింది. సీజన్ 3కి చక్కగా ఆడిషన్స్ ముగిశాయి. మంచి కంటెస్టెంట్స్ వచ్చారు. గత సీజన్స్‌లాగా ఈ సీజన్లోనూ చాలా మంచి ఆణిముత్యాలు దొరికారు. వాళ్లు ఈ వేదిక ఎలా ఉపయోగించుకుని ప్రతిభను చాటుకుంటారో చూడాలి. ఇండియన్ ఐడల్ సీజన్ 3 చాలా చాలా బావుంటుంది’’.
ఆహా నుంచి రాకేష్: ‘‘తెలుగు ఇండియన్ ఐడల్ రెండు సీజన్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మూడో సీజన్ రానుంది. మేం ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. దీనికి ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తేవాలనే ఉద్దేశంతో యు.ఎస్‌లో ఆడిషన్స్ చేశాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సీజన్ గొప్పగా ఉంటుందని భావిస్తున్నాను’.