19 సంవత్సరాల తర్వాత ఆ హీరోతో మూవీ సెట్ చేసిన పూరి జగన్నాథ్..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన బద్రి అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టి ఈ మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని తెలుగు లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత నుండి కొన్ని సంవత్సరాల వరకు ఈయన వరుస విజయాలను అందుకుంటూ తెలుగు సినీ పరిశ్రమలో తిరుగు లేని స్థాయికి చేరుకున్నాడు.

ఇకపోతే ఈయన ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎంతో మంది స్టార్ హీరోల మూవీ లకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు  అందులో భాగంగా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తో కూడా కొన్ని సినిమాలకు ఈయన దర్శకత్వం వహించాడు. పూరీ జగన్నాథ్ , నాగార్జున కాంబోలో మొట్ట మొదటి సారి శివమణి అనే మూవీ రూపొందింది. ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబో లో సూపర్ అనే మూవీ రూపొందింది.

ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుంది. ఇక 2005 వ సంవత్సరం విడుదల అయిన సూపర్ మూవీ తర్వాత వీరి కాంబోలో ఇప్పటి వరకు మూవీ రాలేదు. ఇక మరికొన్ని రోజుల్లోనే వీరి కాంబోలో మరో సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ , రామ్ పోతినేని తో డబల్ ఈస్మార్ట్ అనే మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

ఇక నాగార్జున "నా సామి రంగ" సినిమా తర్వాత ఈ మూవీ ని ఓకే చేయలేదు. దానితో కొన్ని రోజుల క్రితమే పూరి , నాగ్ కు కథ వినిపించడం , ఆయన చెప్పిన కథ సూపర్ గా నాగ్ పూరి మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు దానితో వీరి కాంబోలో ఆల్మోస్ట్ మూవీ కన్ఫామ్ అయినట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

pj

సంబంధిత వార్తలు: