"గం గం గణేశా" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!

Pulgam Srinivas
దొరసాని సినిమాతో వెండి తేరకు పరిచయం అయిన ఆనంద్ దేవరకొండ ఇప్పటికే పలు సినిమాలలో నటించి అందులో కొన్ని సినిమాలతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇకపోతే ఈ నటుడు కొంత కాలం క్రితం బేబి అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం తో ఈయన క్రేజ్ సూపర్ గా పెరిగిపోయింది.
 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు గం గం గణేశా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఉదయ్ శెట్టి ఇది సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈయన ఈ సినిమాతోనే దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టబోతున్నాడు. ప్రగతి శ్రీవాస్తవ , కరిష్మా ఈ మూవీ లో హీరోయిన్ లుగా కనిపించనుండగా ... వెన్నెల కిషోర్ , జబర్దస్త్ ఆర్టిస్ట్ ఇమ్మానుయేల్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.

ఇకపోతే ఈ సినిమాని మే 31బీవ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో పనిని పూర్తి చేసుకుంటూ వెళుతున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది.

ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ad

సంబంధిత వార్తలు: