"లవ్ మీ" హిట్ కావాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలో తెలుసా..?

Pulgam Srinivas
రౌడీ బాయ్స్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన యువ నటుడు ఆశిష్ రెడ్డి తాజాగా లవ్ మీ సినిమాలో హీరో గా నటించాడు. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను రేపు అనగా మే 25 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి సంబంధించిన దాదాపు అన్ని ఏరియాల థియేటర్ హక్కులను మేకర్స్ అమ్మి వేశారు.

అందులో భాగంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ఎన్ని కోట్ల షేర్ కలెక్షన్ లను సాధిస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది అనే విషయాలను తెలుసుకుందాం. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి దాదాపుగా 4.5 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మిగతా ప్రాంతాలలో కలిపి ఈ మూవీ.కి ఒక కోటి వరకు ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దానితో మొత్తంగా ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 5.5 కోట్ల మేర ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం అందుతుంది.

ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా కనుక ప్రపంచ వ్యాప్తంగా ఆరు కోట్ల షేర్ కలక్షన్ లను రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది. మరి ప్రస్తుతానికి ఈ సినిమాపై మంచి అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఈ మూవీ కనుక హిట్ టాక్ తెచ్చుకున్నట్లు అయితే చాలా ఈజీగా ఈ సినిమా ఆరు కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: