అఫీషియల్ : "క్రూ" ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
బాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ ఉన్న నటీమణులుగా కెరియర్ ను కొనసాగిస్తున్న టబు , కరీనా కపూర్ , కృతి సనన్ ప్రధాన పాత్రల్లో "క్రూ" అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన ముగ్గురు నటీమణులు కలిసిన నటించడం తో ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఇక ఈ సినిమాకు బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కాయి.

కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా 50 రోజులను కూడా కంప్లీట్ చేసుకుంది. 50 రోజులు కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి అంటేనే దానితోనే ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో మన అందరికీ తెలిసిపోతుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో అద్భుతమైన రీతిలో సక్సెస్ అయిన ఈ సినిమా తాజాగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ రోజు అనగా మే 24 వ తేదీ నుండి ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ వారు తమ సంస్థ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. మరి ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. మరి ఈ సినిమా ఓ టీ టీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: