తన రిలేషన్ షిప్ స్టేటస్ పై ఓపెన్ అయిన శృతిహాసన్.. అంత అనుకుందే జరిగింది..!

Pulgam Srinivas
తమిళ సినిమాల ద్వారా కెరియర్ ను మొదలు పెట్టి తెలుగు సినిమాల ద్వారా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శృతి హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కెరియర్ ప్రారంభం లో చాలా తమిళ సినిమాల్లో నటించినప్పటికీ వాటి ద్వారా ఈమెకు మంచి విజయాలు దక్కలేదు. ఇక ఈమె తెలుగు సినిమా అయినటువంటి గబ్బర్ సింగ్ మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది.

ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ గా కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. ఈమె పోయిన సంవత్సరం బాలకృష్ణ హీరో గా రూపొందిన వీర సింహా రెడ్డి , చిరంజీవి హీరో గా రూపొందిన వాల్టేరు వీరయ్య , నాని హీరో గా రూపొందిన హాయ్ నాన్న , ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ అనే నాలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. ఈ నాలుగు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.

ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ సలార్ పార్ట్ 2 మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే శృతి హాసన్ కొన్ని రోజుల క్రితమే తన బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పింది అని , ప్రస్తుతం ఒంటరిగా ఉంటుంది అని అనేక వార్తలు బయటకి వచ్చాయి. తాజాగా ఈమె తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి సోషల్ మీడియా వేదికగా ఓపెన్ అయ్యింది.

తాజాగా సోషల్ మీడియా వేదికగా శృతి హాసన్ మాట్లాడుతూ ... తనకి ఇలాంటి వాటికి సమాధానం చెప్పడం ఇష్టం ఉండదు , కానీ ఇప్పుడు చెప్తానని తెలిపింది. ఆమె ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నాను అని అలాగే కేవలం నా వర్క్ , లైఫ్ ని ఎంజాయ్ చెయ్యడంలో మాత్రమే మింగిల్ అవ్వడానికే ఇష్ట పడతాను అని ఆమె క్లారిటీ ఇచ్చేసింది. ఇలా తాజాగా శృతి హాసన్ తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి తాజాగా ఓపెన్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: