బుజ్జి తో అన్ని అద్భుతాలు.. దానికోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ సినిమా కల్కి. దాదాపుగా 400 కోట్లకు పైగానే బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రాబోతోంది. ఇక ఇందులో ప్రభాస్ తో పాటు అమితాబచ్చన్ కమలహాసన్ దీపికా పదుకొనే దిశా పట్టానీ ఇటువంటి చాలామంది స్టార్స్ నటించబోతున్నారు. ఇక ఇంతమంది స్టార్స్ తో వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు డార్లింగ్ అభిమానులు. కాగా ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

దీంతో సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు మేకర్స్. అందులో భాగంగానే ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ పోస్టర్స్ అన్నీ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి అని కామెంట్స్ పెడుతున్నారు డార్లింగ్ అభిమానులు. దీంతో ప్రమోషన్స్ ని సైతం వేగంగా చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ప్రభాస్ ఈ సినిమాలో వాడే బుజ్జి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఈ బుజ్జిని తయారు చేయడానికి నాగ్ అశ్విన్ తన టీం అంతా ఎంత

 కష్టపడ్డారు అన్న విషయాన్ని తాజాగా చెప్పుకొచ్చాడు దర్శకుడు. బుజ్జి తయారు చేయడానికి టీం అంతా కూడా చాలా కష్టపడ్డారు అని మేకింగ్ వీడియో ద్వారా చెప్పారు. ఇకపోతే బుధవారం రోజు రామోజీ ఫిలిం సిటీ లో దాదాపుగా నాలుగు కోట్ల ఖర్చుతో బుజ్జి ని పరిచయం చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా దానికి సంబంధించిన గ్లిమ్స్ సైతం విడుదల చేశా.రు ఇందులో భాగంగానే ప్రభాస్ బుజ్జిని డ్రైవ్ చేసుకుంటూ ఈవెంట్ కి వచ్చాడు. అయితే తాజాగా ఇప్పుడు బుజ్జి తయారు చేయడం కోసం ఎంత ఖర్చు అయ్యింది అన్నది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే బుజ్జి తయారు చేయడం కోసం దాదాపుగా ఏడు కోట్లు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: