సమయం వచ్చినప్పుడు మాట్లాడతా... అప్పటివరకు ఏం చేసుకుంటారో చేసుకోండి... హేమ..!

Pulgam Srinivas
రెండు రోజుల క్రితం ఓ ప్రముఖ వ్యక్తి పుట్టిన రోజు సందర్భంగా బెంగళూరు సిటీలో భారీ ఎత్తున ఓ రేవ్ పార్టీ జరిగింది అని , అందులో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొంత మంది ప్రముఖులు కూడా పాల్గొన్నారు అని ఒక వార్త బయటకు వచ్చింది. అలా వార్త బయటకు వచ్చిన కొద్ది సమయం లోనే అందులో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటి హేమ నటుడు శ్రీకాంత్ మరియు మరికొంత మంది కూడా ఉన్నారు అని వార్తలు బయటకు వచ్చాయి. ఇక దానితో హేమ వెంటనే స్పందించి ... నేను నిన్న బెంగళూరు లో జరిగిన రేవ్ పార్టీ లో ఉన్నాను అని వార్తలు వస్తున్నాయి.

అవి అన్ని అవాస్తవం. నేను ప్రస్తుతం హైదరాబాదు లోని ఓ ఫామ్ హౌస్ లో ఉన్నాను. ఇక్కడ చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నాను అని ఓ వీడియో విడుదల చేసింది. దానితో అంతా హేమ నిజం గానే బెంగుళూరు రేవ్ పార్టీలో లేదు అని భావించారు. కానీ బెంగళూరు పోలీసులు ఆమె రాత్రి జరిగిన రేవ్ పార్టీ లో పాల్గొంది. ఆమె ప్రస్తుతం మా కస్టడీ లోనే ఉంది అని చెప్పారు. అలాగే ఒక ఫోటోను కూడా విడుదల చేశారు. దానితో హేమా చెప్పినవి అబద్ధాలు అని రుజువు అయింది. ఇక తాజాగా బెంగళూరు డ్రగ్స్ కేసులో ఈమెకు పాజిటివ్ రావడంతో నటి హేమను ఓ మీడియా సంస్థ సంప్రదించినట్లు తెలుస్తోంది.

దానితో ఈమె ఆ మీడియా వ్యక్తులతో దురుసుగా ప్రవర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా ఈమెను ఓ మీడియా ఛానల్ వారు సంప్రదించగా , తాను ఇప్పుడే మాట్లాడను అని , సమయం వచ్చినప్పుడు మాట్లాడుతాను అని అప్పటి వరకు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి. ఇకపోతే మొదట్లో తాను పార్టీకి వెళ్లలేదు అని చెబుతూ వీడియోని విడుదల చేసిన హేమ నిన్న ఇంట్లో బిర్యానీ వండుతున్న వీడియోను విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: