షాక్: డ్రగ్స్ కేసులో చిక్కిన హేమ.. ఆధారాలివే..!

Divya
టాలీవుడ్లో గత కొంతకాలంగా డ్రగ్స్ కేస్ కలకలాన్ని సృష్టిస్తోంది. చాలామంది సెలబ్రిటీలు కూడా ఇందులో చిక్కుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత కొన్నేళ్ళకు వాటి నుంచి బయటపడ్డారు. అయినా కూడా ఇప్పటికీ సెలబ్రిటీలు పలు రకాల పార్టీలలో పబ్బులలో చిక్కుతూ కనిపిస్తూ ఉన్నారు. తాజాగా టాలీవుడ్ నటి అయిన హేమ గత రెండు రోజుల నుంచి రేవ్ పార్టీలో చిక్కినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయం పైన తనకి ఎలాంటి సంబంధం లేదనే విధంగా వీడియోలతో క్లారిటీ ఇచ్చినప్పటికీ దీంతో పలు రకాల అనుమానాలు కూడా మొదలయ్యాయి.

ఈ రోజున బెంగళూరు డ్రగ్స్ కేస్ పార్టీలో పాల్గొన్న కొంతమందిని టెస్ట్ చేయగా ఇందులో 86 మంది డ్రక్స్ తీసుకున్నట్లుగా నార్కోటిక్స్ బృందం తెలియజేసింది. అయితే ఇందులో హేమ కూడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు.. ఈ మేరకు నార్కోటిక్ టీమ్ ఒక రిపోర్ట్ ను కూడా అందించింది. ఆరేవ్ పార్టీలో పాల్గొన 15 7 మందికి గాను బ్లడ్ శాంపిల్స్ చేశారని నార్కోటిక్ టీమ్ తెలియజేసింది. ముఖ్యంగా ఇందులో 57 మంది పురుషులు ఉండగా 27 మంది మహిళల రక్త నమూనాలలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లుగా అధికారులు సైతం గుర్తించారు.

మొత్తం మీద బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో సైతం 86 మందికి ఈ పరీక్షలలో పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో నటి హేమ పేరు ఉండడం కూడా అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హేమా తో పాటుగా వీరందరి నీ బాధితులుగా పరిగణించిన అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రెండు రోజుల నుంచి తనకు డ్రగ్స్ కేసుతో రేవు పార్టీలతో సంబంధం లేదని తెలియజేస్తున్న హేమ మరి ఈ విషయం పైన ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. గతంలో ఎన్నో చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన హేమ ప్రస్తుతం అవకాశాలు అయితే పెద్దగా రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: