వైరల్ అవుతున్న ఎన్టీఆర్ లేటెస్ట్ ఫోటో.. అదుర్స్..!!

murali krishna
తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌డే జరిగిన విషయం తెలిసిందే. ఆయన పెట్టిన రోజు సందర్భంగా ఫ్యామిలీ, సినీ సెలబ్రెటీలు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేశారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు  ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా తారక్ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఎన్టీఆర్ లేటెస్ట్ ఫోటో ఫుల్ కిక్కు ఇచ్చేలా ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.జూనియర్ ఎన్టీఆర్ ను ఫ్యాన్స్ ప్రేమగా మ్యాన్ ఆఫ్ మాసెస్ అని పిలుచుకుంటున్నారు. కండలు చూపిస్తూ తారక్ దిగిన ఈ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం తారక్ విదేశాల్లో ఉండగా అక్కడే భార్య, పిల్లలతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారని తెలుస్తోంది.వార్2 లో హృతిక్ కు ధీటుగా ఫైట్స్ చేయడానికే తారక్ కండలు పెంచుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. లుక్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ తారక్ అభిమానులను ఇంప్రెస్ చేస్తున్నారని అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం. వార్2 సినిమాకు సంబంధించిన అప్ డేట్ రాలేదని అభిమానులు నిరాశ చెందుతుండగా సరైన సమయం వచ్చినప్పుడు ఆ సినిమా నుంచి కూడా అప్ డేట్ వస్తుందని అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.వార్2 షూటింగ్ ముంబైలో జరుగుతోందని హృతిక్, తారక్ కాంబో సీన్స్ ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేయడం మాత్రం పక్కా అని సమాచారం అందుతోంది. వార్2 సినిమా విడుదలకు 15 నెలల సమయం ఉంది. ఈ మధ్య కాలంలో తారక్ వేగంగా సినిమాల్లో నటించడం లేదని కామెంట్లు వినిపిస్తుండగా ఆ కామెంట్లకు చెక్ పెట్టేలా తారక్ వరుస సినిమాలను ప్రకటిస్తూ అభిమానులను ఫిదా చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తారక్ పుట్టినరోజున ఎన్టీఆర్ కొత్త సినిమాలకు సంబంధించి ప్రకటనలు రానున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. తారక్ భవిష్యత్తు సినిమాలు సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: