పవన్ కళ్యాణ్ పై ఘాటు కామెంట్స్ చేసిన జూనియర్ సమంత..!!

murali krishna
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది అమ్మాయిలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్నారు. తద్వారా సినిమా ఆఫర్లను కూడా పట్టేశారు.మరికొందరైతే పెద్ద సెలెబ్రిటీలు అయిపోయారు. అలాంటి వారిలో తెలుగు బోల్డ్ లేడీ అషు రెడ్డి ఒకరు. డబ్‌స్మాష్ వీడియోలతో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఆ సుందరాంగి ఫుల్ ఫేమస్ అయింది. అప్పటి నుంచి ఎన్నో ఆఫర్లు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కల్యాణ్‌పై బోల్డ్ కామెంట్స్ చేసి షాకిచ్చింది. అసలు అషు రెడ్డి ఏం చెప్పిందో మీరే చూడండి.డబ్‌స్మాష్ వీడియోల వల్ల అషు రెడ్డికి జూనియర్ సమంత అనే పేరు వచ్చింది. దీని వల్ల సినిమాల్లో నటించాలన్న ఆసక్తి కూడా కలిగింది. దీంతో ఛాన్సుల కోసం వేచి చూసింది. ఇలాంటి సమయంలో నితిన్ హీరోగా చేసిన 'ఛల్ మోహనరంగ'లో దర్శక నిర్మాతలు ఆమెను తీసుకున్నారు. ఈ చిత్రానికి పవన్ కల్యాణ్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. దీంతో అషు హైలైట్ అయింది.అషు రెడ్డికి బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం వచ్చింది. అయితే, ఈ షోలో అంతగా ప్రభావాన్ని చూపకపోయినా ఈ అమ్మడు.. తన క్రేజ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంది. ఇక, నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో రాణించినా కూడా అషు ఫినాలేకు చేరకుండానే ఎలిమినేట్ అయింది. కానీ, ఆమె ఫాలోయింగ్ మాత్రం పెరిగింది.అషు రెడ్డి గతంలో బుల్లితెరపై పలు రకాల షోలలో భాగం అయింది. అదే సమయంలో కొన్ని సినిమాల్లోనూ నటించింది. కానీ, బిగ్ బాస్ నాన్ స్టాప్ షో తర్వాత మాత్రం ఈ అమ్మడు స్పీడు తగ్గించేసింది. ఈ ఖాళీ సమయంలో మాత్రం ఆమె బోల్డుగా వ్యవహరిస్తూ సెన్సేషన్ అయిపోయింది. ముఖ్యంగా హాట్ ట్రీట్లు, రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూలతో ఈ బ్యూటీ రచ్చ లేపేసింది.బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలోనే అషు రెడ్డి తాను పవన్ కల్యాణ్‌కు వీరాభిమానిని అని చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఆయన పేరును ప్రైవేటు ప్లేస్‌లో టాటూగా వేయించుకున్నట్లు ఓ ఫొటోను కూడా షేర్ చేశారు ఆమె స్నేహితులు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ అషు రెడ్డికి మద్దతు తెలిపారు. ఇక, ఈ మధ్య మరోసారి తన టాటూను చూపిస్తూ దిగిన ఫొటోను షేర్ చేసింది.కొంత కాలంగా అషు రెడ్డి ఎందుకనో పెద్దగా బయట కనిపించలేదు. కానీ, ఇప్పుడు ఈ అమ్మడు మళ్లీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా ఘాటు ఫొటోషూట్లతో ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. అలాగే, ఇప్పుడు 'యేవమ్' అనే సినిమాలో కూడా నటిస్తోంది. దీనితో పాటు మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లలోనూ ఆమె నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.అషు రెడ్డి గతంలో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో యాంకర్ 'ఉదయం లేచే సరికి నీ బెడ్‌రూంలో పవన్ కల్యాణ్ ఉంటే ఏం చేస్తావ్' అని ఆమెను ప్రశ్నించింది. దీనికి అషు రెడ్డి 'అదే జరిగితే.. ఆరోజు అస్సలు పూర్తి కాకూడదు అనుకుంటా. మళ్లీ మళ్లీ అలాంటి రోజే రావాలని దేవుడిని కోరుకుంటా' అంటూ నాటీగా సమాధానం చెప్పేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: