కల్కి2898ఏడి: టాలీవుడ్ స్థాయిని మరింత పెంచేస్తోంది?

Purushottham Vinay
ఎవడే సుబ్రమణ్యం మూవీతో దర్శకుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు నాగ్ అశ్విన్. తొలి మూవీనే డిఫరెంట్ జానర్‌ను ఎంచుకొని సంథింగ్ స్పెషల్ అనిపించుకున్నారు.రెండో ప్రయత్నంగా మహానటి సావిత్రి జీవిత కథను వెండితెర మీద ఆవిష్కరించే సాహసం చేశారు ఈ యంగ్ డైరెక్టర్. ఈ మూవీని అసలు ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా తెరకెక్కించటంలో సక్సెస్‌ అయిన నాగీ, రెండో ప్రయత్నంలోనే అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఇతనిలో ఏదో మ్యాజిక్ ఉంది అనే ముద్రని వేసుకున్నాడు. అందుకే కేవలం రెండు మూవీస్ మాత్రమే చేసిన అనుభవమే ఉన్న నాగీ ఇప్పుడు తన టాలెంట్ తో ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీని డైరెక్ట్‌ చేసే ఛాన్స్ ఇచ్చారు.ప్రభాస్ తో చేస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ కోసం దాదాపు ఐదేళ్లుగా కష్టపడుతున్నారు నాగీ. ఈ సూపర్ హీరో కాన్సెప్ట్‌ను భుజానికి ఎత్తుకున్న ఈ యంగ్ డైరెక్టర్‌, తన ఊహల్లో ఉన్న విజువల్స్‌ను తెర మీదకు తీసుకు వచ్చేందుకు చాలా విధాలుగా కష్టపడుతున్నారు.


తొలిసారిగా మేకింగ్‌లో ఆటోమొబైల్‌ ఇంజనీర్స్‌ను కూడా భాగం చేయటం, మహీంద్ర లాంటి ఆటోమొబైల్‌ కంపెనీస్‌లో కలిసి వర్క్ చేయటం లాంటి పెద్ద ప్రయోగాలు చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌తో మూవీ మీద పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయటంలో సక్సెస్‌లో అయ్యారు నాగ్ అశ్విన్. ముఖ్యంగా స్క్రాచ్ పేరుతో మేకింగ్ వీడియోస్‌ను రిలీజ్ చేస్తూ తెర వెనుక టీమ్ పడిన కష్టాన్ని ఆడియన్స్‌కు చూపిస్తున్నాడు. ఇలా ప్రతీ విషయంలో కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో దూసుకుపోతున్న నాగ్ అశ్విన్ , కల్కి రిలీజ్ తరువాత ఇండియాస్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరటం ఖచ్చితంగా ఖాయం అంటున్నారు విశ్లేషకులు. అతని కథలో ఎంత బలం లేకపోతే అమితాబ్, కమల్ హాసన్, ప్రభాస్ లాంటి వాళ్లు ఈ చిత్రంలో భాగమవుతారు చెప్పండి. ఏది ఏమైనా నాగ్ అశ్విన్ ఈ సినిమాతో తెలుగు ప్రజలు గర్వపడేలా ప్రపంచ స్థాయిలో  సత్తా చాటుతాడు అని ఖచ్చితంగా అనిపిస్తుంది. రాజమౌళి సినిమాలని మించే విధంగా నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడిని తెరకెక్కిస్తున్నాడని ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ ద్వారా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: