కాస్లీ కార్ కొన్న నాగచైతన్య.. ధర ఎన్ని కోట్లో తెలుసా?

praveen
సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక సినిమాల ద్వారా ప్రతి ప్రేక్షకుడికి కూడా చేరువవుతూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు. అయితే సినీ సెలెబ్రెటీల లైఫ్ స్టైల్ గురించి దాదాపు అందరికీ అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. అందుకే ఇక సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు అభిమానులు తెగ ఆసక్తి కనపరుస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీలు వాడుతున్న వస్తువులు.. వేసుకున్న డ్రెస్ చేతికి ధరించిన వాచ్ లు.. ఇలా అన్ని ఎంత కాస్లీ అని తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇక మరోవైపు కొంతమంది స్టార్ హీరోలు వాడే కాస్లీ కార్లు కూడా ఇలాగే ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇటీవల అక్కినేని హీరో నాగచైతన్య ఒక కాస్లీ కారు కొనుగోలు చేయగా ఇదే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఇక ఈ కారు ధర గురించి కలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు అని చెప్పాలి.

 పోర్శే 911 జిటి 3ఆర్ఎస్ కార్ ను కొనుగోలు చేశాడు నాగచైతన్య. దీని ధర ఏకంగా 3.5 కోట్ల రూపాయలు అని సమాచారం. అయితే కారు పక్కన నాగ చైతన్య ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే అత్యంత ఖరీదైన పలు లగ్జరీ కార్లు ఇప్పటికే నాగచైతన్య దగ్గర ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా నాగచైతన్య గ్యాలరీలో ఏకంగా నాలుగు కోట్ల పైబడిన లంబోర్కిని, ఫెరారీ, ల్యాండ్ రోవర్ తదితర సంస్థలకు చెందిన కార్లు కూడా ఉన్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం అక్కినేని హీరో నాగచైతన్య చందు ముండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తండేల్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: