మరో బయోపిక్ కి సైన్ చేసిన కీర్తి సురేష్... ఈసారి డబల్ కిక్..!

lakhmi saranya
టాలీవుడ్ బడా హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. గతంలో ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే మహానటి బయోపిక్ మాత్రం మరొక ఎత్తు. సావిత్రి నే మరోసారి భూమిపైకి తిరిగి వచ్చిందా అనే విధంగా కీర్తి సురేష్ ఈ బయోపిక్ లో ఒదిగిపోయింది. ఇక ఈ సినిమా కీర్తి సురేష్ కెరీర్ కి ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. సావిత్రిగా తన అద్భుతమైన నటనతో ప్రతి ఒక్కరిని మెప్పించింది కీర్తి సురేష్.

ఇక తాజాగా మరో బయోపిక్ లో ఈ బ్యూటీ నటించబోతుంది అంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బయోపిక్ మరెవరిదో కాదు.. ప్రముఖ దాయని, గాన కోకిల ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఈ సినిమా గురించి గతంలో ఎప్పుడో ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్స్ లేవు. ఇక తాజాగా ఈ సినిమాకు హీరోయిన్ ను వెతికే పనిలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆవిడ జీవితాన్ని రూపొందించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి.

నిర్మాణ సంస్థ, దర్శకుడు తదితర వివరాలు ఇంకా రిలీజ్ కాలేదు. కానీ ఈ మూవీ లో కీర్తి సురేష్ లీడ్రోల్ ప్లే చేస్తున్నట్లు కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. సుబ్బలక్ష్మి జీవితంలో ఎన్నో ఘటనలు ఉన్నాయి. కొన్ని ఆనందమైన ఘటనలు అయితే మరికొన్ని విషాద ఘటనలు ఏర్పడ్డాయి. ఇక వీటన్నిటిని తమ ఎక్స్ప్రెషన్స్ తో కట్టిపడేసే సత్తా ఒక కీర్తి సురేష్ కె ఉందని భావించడం మేకర్స్ ఈ బ్యూటీ ని అప్రోచ్ అయ్యారట. ఇక దీనికి కీర్తి సురేష్ సైతం ఓకే చెప్పిందట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక ఈ వార్తను విన్న పలువురు ప్రేక్షకులు...మరోసారి బంపర్ ఆఫర్ కొట్టేసావు కదా కీర్తి సురేష్ . లక్ అంటే ఇది కదా...అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: